గౌతమ్ గంభీర్(Gautham Gambhir).. భారత క్రికెట్ చరిత్రలో(Cricket history) గంభీర్ కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక పొలిటికల్ గా కూడా భారతీయ జనతా పార్టీలో(BJP) కొనసాగుతున్న గంభీర్ ఢిల్లీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. అలాంటి గంభీర్ ఇప్పుడు రాజకీయాల నుండి తప్పుకోవాలని భావిస్తూ ఉన్నాడు. తనను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించాలని బీజేపీ చీఫ్‌ని గౌతమ్ గంభీర్ కోరారు.

భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తూర్పు ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెటర్, తన అనుచరులు, మద్దతుదారులకు ఈ విషయం గురించి తెలిపాడు. క్రికెట్ పై తన దృష్టిని మళ్లించాల్సిన అవసరాన్ని గుర్తు చేశాడు. "నేను రాబోయే క్రికెట్ కమిట్‌మెంట్‌లపై దృష్టి పెట్టడానికి నా రాజకీయ బాధ్యతల నుండి నన్ను తప్పించమని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా జీని అభ్యర్థించాను. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్" అని గంభీర్ ట్విట్టర్ లో రాశాడు.
గంభీర్, మార్చి 2019లో బీజేపీలో చేరారు. అప్పటి నుండి ఢిల్లీలో పార్టీకి ప్రముఖ వ్యక్తిగా మారారు. అతను 2019 లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ స్థానంలో 6,95,109 ఓట్ల తేడాతో పోటీ చేసి గెలుపొందాడు.