రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) చివరి బంతికి గెలుపొందిన విషయం తెలిసిందే. అది కూడా వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్(Teamindia) బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) 44 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో కోహ్లీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) చివరి బంతికి గెలుపొందిన విషయం తెలిసిందే. అది కూడా వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్(Teamindia) బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) 44 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో కోహ్లీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ మార్క్‌కు చేరుకోవడానికి ఎక్కువ బంతులు ఆడాడని క్రికెట్ వ్యాఖ్యాత సైమన్ డౌల్ అన్నాడు. 42 పరుగుల నుంచి 50 పరుగుల మార్క్‌కు చేరుకోడానికి పది బంతులు ఆడటం సరి కాదని విమర్శించాడు.
'మొదట్నుంచి దూకుడుగా ఆడిన కోహ్లీ . హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చినప్పుడు మాత్రం స్లోగా ఆడాడని తెలిపాడు 'కోహ్లీ రికార్డుల కోసం ఆందోళన చెందుతున్నట్లు ఉన్నాడు. కోహ్లీ తన ఇన్నింగ్స్‌ను బుల్లెట్ ట్రెయిన్ మాదిరిగా ప్రారంభించాడు. అద్భుతమైన షాట్లు కొట్టాడు. 25 బంతుల్లో 42 పరుగులు చేసిన కోహ్లీ, మరో అయిదు పరుగులు చేసేందుకు 10 బాల్స్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడికి మైలురాళ్లు అవసరం లేదనకుంటా. అప్పటికే చాలా మంది బ్యాటర్లు వెనక ఉన్నారు. అప్పుడు దూకుడుగా ఆడితే బాగుండేది' అని డౌల్ అన్నాడు. మొత్తం మీద వ్యక్తిగత రికార్డు కోసమే కోహ్లీ నెమ్మదిగా ఆడాడని పరోక్షంగా చెప్పాడు డౌల్. అయితే కోహ్లీపై డౌల్ చేసిన విమర్శలను పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ కొట్టిపారేశాడు. సైమన్ డౌల్(Simon Doull) పాకిస్తాన్‌లో ఉన్నప్పుడు కూడా బాబర్ అజామ్‌ను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలే చేశాడన్నాడు భట్. డౌల్ కనుక బెంగళూరు, లఖ్‌నవూ మ్యాచ్‌ను జాగ్రత్తగా పరిశీలించి ఉంటే ఇలా మాట్లాడేవాడు కాదన్నాడు. 'ఎందుకంటే రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో విరాట్ నాలుగు సార్లు షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆటలో ఇదంతా కామన్. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 75 సెంచరీలు సాధించిన కోహ్లీ కొత్తగా మైలురాళ్ల కోసం తాపత్రయ పడాల్సిన అవసరం లేదు. ఎవరి కోసమూ నిరూపించుకోవాల్సిన పని లేదు' అని సల్మాన్ భట్ వ్యాఖ్యానించాడు. డౌల్ చేసిన కామెంట్లు దరద్రంగా ఉన్నాయని, డౌల్ కూడా క్రికెట్ ప్లేయరే కానీ, బౌలరవ్వడం వల్లే అతడికి అవగాహన తక్కువ అని భట్ తెలిపాడు.