భారత క్రికెట్(India Cricket)లో విషాదం నెలకొంది. భారత క్రికెట్ జట్టు(India Cricket Team)కు ఆడిన మరో మాజీ ఓపెనర్ కన్నుమూశారు. 1974లో భారత్ తరఫున మూడు టెస్టు మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడిన మాజీ ఓపెనర్ సుధీర్ నాయక్(Sudhir Naik) బుధవారం ముంబై(Mumbai)లోని ఆసుపత్రిలో మరణించాడు. అతని మరణాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) వర్గాలు ధృవీకరించాయి. 78 ఏళ్ల వయసులో ముంబైలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఒక కుమార్తె ఉంది.

Cricketer Sudhir Naik Psses Away

సుధీర్ నాయక్ ఇటీవల బాత్రూమ్ లో పడటంతో.. ఆయన తలకు దెబ్బ తగిలింది. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. సుధీర్ నాయక్ కోమాలోకి వెళ్లి.. కోలుకోలేదు. ఇటీవల వెటరన్ ఆల్ రౌండర్ సలీం దురానీ క్యాన్సర్‌తో మరణించగా.. వారం వ్యవధిలో భారత క్రికెట్ ప్రపంచం నుంచి ఇది రెండో విషాద వార్త. సుధీర్ నాయక్ ముంబై క్రికెట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగారు. కెప్టెన్ గా జట్టును రంజీ ట్రోఫీ విజేతగా నిలిపాడు. అతని నాయకత్వంలో జట్టు 1970-71 సీజన్‌లో రంజీ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ సీజన్‌లో సునీల్ గవాస్కర్, అజిత్ వాడేకర్, దిలీప్ సర్దేశాయ్, అశోక్ మన్కడ్ వంటి స్టార్లు లేకుండానే ముంబై రంజీ ట్రోఫీని గెలుచుకోవడంతో అందరూ సుధీర్ నాయక్ కెప్టెన్సీని మెచ్చుకున్నారు.
సుధీర్ నాయక్ 1974లో ఇంగ్లాండ్ పర్యటనలో బర్మింగ్‌హామ్ టెస్ట్ ద్వారా అరంగేట్రం చేసాడు. అక్కడ 77 పరుగులు ఏకైక అర్ధ సెంచరీని సాధించాడు. సుధీర్ నాయక్ 85 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 35 కంటే ఎక్కువ సగటుతో 4,376 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీతో సహా ఏడు సెంచరీలు ఉన్నాయి. కోచ్‌గా నాయక్ చురుకైన పాత్ర పోషించాడు. జహీర్ ఖాన్ కెరీర్‌లో పెద్ద పాత్ర పోషించాడు. క్రికెట్ ఆడటానికి అతన్ని ముంబైకి తీసుకువచ్చి అతనికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించాడు. ముంబై సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా కూడా పని చేశారు. అనంతరం ఆయన ఉచితంగా వాంఖడే స్టేడియం క్యూరేటర్‌గా కూడా పనిచేశాడు.
మాజీ ఓపెనర్ సుధీర్ నాయక్ మృతికి గురువారం సంతాపం తెలిపిన భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ).. క్రికెట్ పట్ల అతని అభిరుచి చాలా మంది క్రికెటర్ల కెరీర్‌ను రూపొందించిందని.. ఆయన భవిష్యత్ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తాడని పేర్కొంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని.. సుధీర్ నాయక్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా క్రీడకు ఆయన అందించిన సహకారం క్రీడలో పాల్గొనాలనుకునే వారందరికీ స్ఫూర్తినిస్తుందన్నారు. బీసీసీఐ సెక్రటరీ జై షా మాట్లాడుతూ.. సుధీర్ నాయక్ మరణ వార్త వినడం చాలా బాధ కలిగించిందని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ముంబై క్రికెట్ అసోసియేషన్‌లోని ప్రతి ఒక్కరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.