భారత క్రికెటర్ మనోజ్ తివారీ(Manoj Tiwari) గ‌త గురువారం అన్ని ఫార్మ‌ట్‌ల‌ క్రికెట్‌కు రిటైర్మెంట్(Retirement) ప్ర‌క‌టించాడు. అయితే ఐదు రోజుల్లోనే రిటైర్మెంట్ పై తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అయితే.. మనోజ్ తివారీ ఇప్పుడు రిటైర్మెంట్ పై యూ-టర్న్ తీసుకున్నాడు. తివారి నిర్ణ‌యాన్ని అధికారికంగా ప్రకటించాల్సివుంది. నివేదికల ప్రకారం..

భారత క్రికెటర్ మనోజ్ తివారీ(Manoj Tiwari) గ‌త గురువారం అన్ని ఫార్మ‌ట్‌ల‌ క్రికెట్‌కు రిటైర్మెంట్(Retirement) ప్ర‌క‌టించాడు. అయితే ఐదు రోజుల్లోనే రిటైర్మెంట్ పై తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అయితే.. మనోజ్ తివారీ ఇప్పుడు రిటైర్మెంట్ పై యూ-టర్న్ తీసుకున్నాడు. తివారి నిర్ణ‌యాన్ని అధికారికంగా ప్రకటించాల్సివుంది. నివేదికల ప్రకారం.. బుధ‌వారం విలేకరుల సమావేశం ద్వారా తివారి త‌న నిర్ణ‌యాన్ని అధికారికంగా ప్రకటించనున్నాడు.

మనోజ్ తివారీ ఆగస్టు 3న క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మరోసారి తివారీ క్రికెట్ ఫీల్డ్‌లోకి వస్తాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 8న మనోజ్ తివారీ తన రిటైర్మెంట్ ఉపసంహరణను విలేకరుల సమావేశంలో ప్రకటించనున్నట్లు స‌మాచారం.

బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీతో(Snehash Ganguly) మాట్లాడిన తర్వాత మనోజ్ తివారీ తన రిటైర్మెంట్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. నిజానికి మనోజ్ రిటైర్మెంట్ తర్వాత బెంగాల్ క్రికెట్ మిడిల్ ఆర్డర్ బాగా బలహీనపడింది. దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అతని రిటైర్మెంట్ ఉపసంహరించుకోవాలని కోరారు.

తివారీ భారత్ తరఫున 12 వన్డేలు ఆడి ఒక‌ సెంచరీ, ఒక‌ హాఫ్ సెంచరీ న‌మోదు చేశాడు. టీమిండియా త‌రుపున‌ 3 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు కూడా ఆడాడు. తివారీ 141 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 9,908 పరుగులు చేశాడు. ఓ ట్రిపుల్ సెంచరీ(303) కూడా చేయ‌డం విశేషం. ఫస్ట్ క్లాస్ క్రికెట్ తివారీ 29 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతను లిస్ట్-ఏ క్రికెట్‌లో 169 మ్యాచ్‌ల్లో 5,581 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Updated On 9 Aug 2023 1:54 AM GMT
Ehatv

Ehatv

Next Story