హైదరాబాద్‌(Hyderabad) వేదికగా ఇండియాతో(India) జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌ ఇంగ్లండ్‌(england) సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ రెండో ఇన్నింగ్స్‌లో 196 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర వహించాడు. ఇతడితో పాటు స్పిన్నర్‌ టామ్‌ హార్ట్లీ(Tom Hartley) సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 62 పరుగులిచ్చి ఏడు వికెట్లు తీసుకోవడంతో గెలుపు దక్కింది. హార్ట్లీకి ఇది తొలి టెస్ట్ కావడం గమనార్హం.

హైదరాబాద్‌(Hyderabad) వేదికగా ఇండియాతో(India) జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌ ఇంగ్లండ్‌(england) సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ రెండో ఇన్నింగ్స్‌లో 196 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర వహించాడు. ఇతడితో పాటు స్పిన్నర్‌ టామ్‌ హార్ట్లీ(Tom Hartley) సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 62 పరుగులిచ్చి ఏడు వికెట్లు తీసుకోవడంతో గెలుపు దక్కింది. హార్ట్లీకి ఇది తొలి టెస్ట్ కావడం గమనార్హం. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్‌లోనే అతడు ఓ అరుదైన రికార్డును, దాంతో పాటు ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. హార్ట్లీ వేసిన తొలి బంతి సిక్సర్‌ కావడం చెత్త రికార్డు అయితే ఈ మ్యాచ్‌లో ఏకంగా తొమ్మిది వికెట్లు తీసుకోవడం అరుదైన రికార్డు. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో తొలి బంతికే సిక్సర్‌ సమర్పించుకుని అదే మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లతో (3/145, 6/73) చెలరేగిన రెండో ఆటగాడిగా హార్ట్లీ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు బంగ్లాదేశ్‌ ఆటగాడు సోహగ్‌ ఘాజీ ఇలాంటి ఘనతను సాధించాడు. 2012లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘాజీ తొలి బంతికే సిక్సర్‌ సమర్పించుకుని, అదే మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు. అలాగే సోహగ్‌ ఘాజీ మరో అదుదైన రికార్డును సాధించాడు. ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో సెంచరీ చేసి హ్యాట్రిక్ సాధించిన ఏకైక క్రికెటర్‌ ఘాజీనే!
అలాగే ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌తో కలుపుకుని ఈ ఘనత రెండుసార్లు సాధించిన ఏకైక క్రికెటర్‌ కూడా ఘాజీనే! ఆ విధంగా ఇతడు చరిత్ర పుటల్లో నిలిచాడు.

Updated On 29 Jan 2024 8:03 AM GMT
Ehatv

Ehatv

Next Story