ఇంగ్లండ్(england) ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ (Stuart Broad)టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్(Retirement) ప్రకటించాడు. బ్రాడ్ 37 ఏళ్ల వయసులో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. యాషెస్ సిరీస్‌లోని ఐదవ, ఆఖరి టెస్టులో ఆడుతున్న బ్రాడ్.. ఓవల్‌లో మూడో రోజు ఆట ముగిసిన తర్వాత.. తాను తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నానని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత‌ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తానని చెప్పాడు.

ఇంగ్లండ్(england) ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ (Stuart Broad)టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్(Retirement) ప్రకటించాడు. బ్రాడ్ 37 ఏళ్ల వయసులో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. యాషెస్ సిరీస్‌లోని ఐదవ, ఆఖరి టెస్టులో ఆడుతున్న బ్రాడ్.. ఓవల్‌లో మూడో రోజు ఆట ముగిసిన తర్వాత.. తాను తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నానని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత‌ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తానని చెప్పాడు. స్టువర్ట్ బ్రాడ్ టెస్టు క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన రెండో ఫాస్ట్ బౌలర్ కాగా.. ఓవరాల్‌గా నాలుగో బౌలర్.

లండన్‌లో మూడో రోజు ఆట ముగిసిన తర్వాత బ్రాడ్ మాట్లాడుతూ.. రేపు లేదా సోమవారం నా క్రికెట్‌లో చివరి ఆట ఆడనున్న‌ట్లు బ్రాడ్ చెప్పాడు. నేను ఒక అద్భుతమైన సిరీస్‌లో భాగం కావాలనుకున్నాను. ఈ సిరీస్ నాకు అలాంటి అనుభూతిని కలిగిస్తుంది. నేను అత్యంత ఆనందించే, వినోదాత్మకమైన సిరీస్‌లలో ఇది ఒకటి అని పేర్కొన్నాడు. నేను కొంతకాలంగా, కొన్ని వారాలుగా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాను. నా చివరి బ్యాటింగ్, బౌలింగ్ యాషెస్‌లో ఉండాలని కోరుకున్నాను. ఆ విష‌యం నేను గత రాత్రి స్టోక్స్‌కు చెప్పాను. నేను నిజంగా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే నేను సాధించిన దానితో నేను సంతృప్తి చెందాను. ఇదే సరైన సమయం అని నేను భావించాను అని చెప్పుకొచ్చాడు.

బ్రాడ్ 167 టెస్ట్ మ్యాచ్‌లలో 602 వికెట్లు, 121 వ‌న్డేల‌లో 178 వికెట్లు, 56 టీ20ల‌లో 65 వికెట్లు.. ఓవ‌రాల్‌గా 845* వికెట్లు పడగొట్టి ఆల్‌టైమ్ గ్రేట్ బౌల‌ర్ల స‌ర‌స‌న నిలిచాడు. ఆగస్టు 2006లో పాకిస్థాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో బ్రాడ్ 20 ఏళ్ల వయస్సులో ఇంగ్లాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. 2007లో శ్రీలంకతో తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2007లో జ‌రిగిన టీ20 ప్రపంచ కప్‌లో యువరాజ్ సింగ్.. బ్రాడ్‌ ఓవర్‌లో ఆరు బంతుల‌కు ఆరు సిక్సర్లు కొట్టాడు. అయితే దీని తర్వాత ఎన్నో రికార్డులను తన పేరు మీద లిఖించుకున్నాడు బ్రాడ్‌. బ్రాడ్ టెస్టుల్లో(169) సెంచ‌రీ కూడా చేయ‌డం విశేషం.

Updated On 30 July 2023 3:20 AM GMT
Ehatv

Ehatv

Next Story