వన్డే ప్రపంచకప్(ODI World Cup 2023) ప్రారంభ మ్యాచ్ అంటే ఎలా ఉండాలి? స్టేడియం దద్దరిల్లిపోవాలి. కానీ అలా జరగలేదు. పుష్కరకాలం తర్వాత ఇండియాలో జరుగుతున్న ఈ మెగా టోర్నీ పట్ల ప్రేక్షకులు ఎందుకు అనాసక్తిగా ఉన్నారు? తొలిసారి భారత్ ఒంటరిగా ఆతిథ్యమిస్తున్న ఈ క్రికెట్ సంబరం ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్(Ahmedabad)లోని నరేంద్రమోదీ స్టేడియం(Narendra Modi Stadium)లో మొదలయ్యింది.
వన్డే ప్రపంచకప్(ODI World Cup 2023) ప్రారంభ మ్యాచ్ అంటే ఎలా ఉండాలి? స్టేడియం దద్దరిల్లిపోవాలి. కానీ అలా జరగలేదు. పుష్కరకాలం తర్వాత ఇండియాలో జరుగుతున్న ఈ మెగా టోర్నీ పట్ల ప్రేక్షకులు ఎందుకు అనాసక్తిగా ఉన్నారు? తొలిసారి భారత్ ఒంటరిగా ఆతిథ్యమిస్తున్న ఈ క్రికెట్ సంబరం ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్(Ahmedabad)లోని నరేంద్రమోదీ స్టేడియం(Narendra Modi Stadium)లో మొదలయ్యింది. ఇంగ్లాండ్-న్యూజిలాండ్/(ENG vs NZ) మధ్య పోరుతో టోర్నీ షురూ అయ్యింది. స్టేడియం అంతా ఖాళీ.. ప్రేక్షకుల హాడావుడే లేదు. బ్యాటర్లు కష్టపడి బౌండరీలు బాదినా, సిక్సు కొట్టినా ఒక్క ఈల లేదు. అరుపులు లేవు. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ అంటే ప్రేక్షకుల రెస్పాన్స్ బాగానే ఉంటుందని అనుకున్నారంతా! సుమారు లక్షన్నర సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడయంలో ప్రేక్షకులు లేక వెలవెలబోయింది. చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా అక్కడక్కడ ప్రేక్షకులు కనిపించారంతే! ప్రారంభోత్సవం ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. కనీసం ఆ వేడుక చూసేందుకు అయినా జనం వచ్చేవారు. అత్యంత ధనిక బోర్డు అయిన బీసీసీఐ ఎందుకు ఆరంభ వేడుకలను రద్దు చేసిందో ఎవరికీ తెలియదు. పైపెచ్చు క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఉన్న చోట మ్యాచ్‌లు పెడితే బాగుండేది. ఇదే మ్యాచ్ ఏ కోల్‌కతాలోనో, ఏ చెన్నైలోనో, ఏ ముంబాయిలోనో నిర్వహించి ఉంటే సగానికి మంచి స్టేడియం నిండేది. గతంలో ఏ ప్రపంచకప్ ఆరంభం ఇంత నిస్సారంగా, నిరుత్సాహంగా జరగలేదు. స్టేడియం ఖాళీగా దర్శనమిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసి నెటిజన్లు బాధపడుతున్నారు.