క్రికెట్ ప్లేయర్లకు ఒకప్పుడు అంతగా డబ్బు వచ్చేది కాదు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం ఇవ్వడమే గొప్పగా భావించేవాళ్లు తప్ప డబ్బు కోసం ఎప్పుడూ పాకులాడలేదు. తమ టాలెంట్‌ను పది మంది చూసి మెచ్చుకోవాలని, గుర్తింపు పొందాలని మాత్రమే అనుకునేవారు. తొమ్మిదో దశకం తర్వాత నుంచి క్రికెటర్లకు భారీగా సొమ్ము రావడం మొదలయ్యింది. ఇప్పుడు టీమిండియాకు రెప్రజెంట్‌ చేసిన వారంతా కోటీశ్వరులే! అద్సరే కానీ, ఇండియాలో రిచ్చెస్ట్‌ క్రికెటర్‌ ఎవరై ఉంటారు?

క్రికెట్ ప్లేయర్లకు ఒకప్పుడు అంతగా డబ్బు వచ్చేది కాదు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం ఇవ్వడమే గొప్పగా భావించేవాళ్లు తప్ప డబ్బు కోసం ఎప్పుడూ పాకులాడలేదు. తమ టాలెంట్‌ను పది మంది చూసి మెచ్చుకోవాలని, గుర్తింపు పొందాలని మాత్రమే అనుకునేవారు. తొమ్మిదో దశకం తర్వాత నుంచి క్రికెటర్లకు భారీగా సొమ్ము రావడం మొదలయ్యింది. ఇప్పుడు టీమిండియాకు రెప్రజెంట్‌ చేసిన వారంతా కోటీశ్వరులే! అద్సరే కానీ, ఇండియాలో రిచ్చెస్ట్‌ క్రికెటర్‌ ఎవరై ఉంటారు? ఈ ప్రశ్ననే క్రికెట్‌ ఫ్యాన్స్‌ను అడిగితే సచిన్‌ టెండూల్కరో, మహేంద్రసింగ్‌ ధోనీనో, లేకపోతే విరాట్‌ కోహ్లీనో, వీరందరూ కాకుంటే రోహిత్‌ శర్మనో అయి ఉంటారని జవాబిస్తారు. వీరంతా ఆటతోనే కాకుండా ఎండార్స్‌మెంట్‌, అడ్వర్‌టైజ్‌మెంట్లతో బాగానే వెనకేసుకున్నారు. ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. కాకపోతే అత్యంత ధనవంతుడైన క్రికెటర్‌ వీరెవ్వరూ కాదు. మరో క్రికెటర్‌ ఉన్నాడు. ఆయనేమైనా ఇంటర్నేషనల్‌ లెవల్‌ క్రకెటరా అంటే అదేం లేదు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌ మాత్రమే. అది కూడా ఆరేడు మ్యాచ్‌లు ఆడి ఉంటాడంతే. అతడి పేరు బరోడాకు చెందిన సమర్‌జిత్‌ సిన్హ్‌ రంజిత్‌ సింగ్‌ గైక్వాడ్‌. బరోడా తరఫున ఆరు రంజీ మ్యాచ్‌లు ఆడాడు. 1987 నుంచి 1989 వరకు బరోడా టీమ్‌లో ఉన్నాడు. మొత్తంగా ఈయన 119 పరుగులు చేశాడు. ఈయన అత్యధిక స్కోరు 65 పరుగులు. క్రికెట్ నుంచి తప్పుకున్నాక బరోడా క్రికెట్ అసోసియేషన్‌ అడ్మినిస్ట్రేటర్‌గా కూడా పని చేశాడు. అయితే ఈయన క్రికెట్ నుంచి సంపాదించింది చాలా తక్కువే! రంజిత్‌ సింగ్‌ కుటుంబం రాజవంశానికి చెందినవారు కావడం వల్లే వారసత్వంగా కోట్ల ఆస్తి ఈయనకు వచ్చింది. మొత్తంగా ఈయన ఆస్తుల విలువ 20 వేల కోట్ల రూపాయలకుపైనే ఉంటుంది. 1967 ఏప్రిల్‌ 25న సమర్‌జిత్‌ సిన్హ్‌ రంజిత్‌ సింగ్‌ గైక్వాడ్‌ జన్మించారు. తండ్రి వడోదర మహారాజు రంజిత్‌సిన్హ్‌ ప్రతాప్‌ గైక్వాడ్‌, తల్లి శుభన్‌గిన్‌ రాజే.. వీరికి ఈయన ఒక్కడే కొడుకు. డెహ్రాడూన్‌లో స్కూల్‌ విద్య పూర్తి చేసుకుని విదేశాలకు వెళ్లాడు. అక్కడ ఉన్నత విద్యను అభ్యసించి ఇండియాకొచ్చేశాడు. స్కూల్‌లో ఉన్నప్పట్నుంచే క్రికెట్‌ ఆడేవాడు. ఫుట్‌బాల్‌, టెన్నిస్‌లో కూడా దిట్టే! 2012 మే మాసంలో తండ్రి చనిపోయారు. తర్వాత ఈయనే మహారాజుగా ఎన్నికయ్యాడు.2012 జూన్‌ 22న లక్ష్మి విలాస్‌ ‍ప్యాలెస్‌లో అంగరంగవైభవంగా ఈయన పట్టాభిషేకం జరిగింది. మహారాజుగా బాధ్యతలు స్వీకరించిన కొన్నాళ్లకే 2013లో అతని మామ సంగ్రామ్‌సిన్హ్‌ గైక్వాడ్‌తో 20 వేల కోట్ల రూపాయల విలువైన వారసత్వ వివాదాన్ని పరిష్కరించుకున్నాడు. ఈ ఒప్పందం ద్వారా సమర్జిత్‌సిన్హ్.. లక్ష్మీ విలాస్ ప్యాలెస్ యాజమాన్యాన్ని, వడోదరలోని మోతీ బాగ్ స్టేడియం, మహారాజా ఫతే సింగ్ మ్యూజియంతో సహా ప్యాలెస్ సమీపంలోని 600 ఎకరాలకు పైగా రియల్ ఎస్టేట్ భూములు, రాజా రవివర్మ వేసిన అనేక చిత్రాలతో పాటు ఫతేసింగ్‌రావ్‌కు చెందిన బంగారం, వెండి, రాజ ఆభరణాలను పొందారు. దీంతో అతని ఆస్తి విలువ 20వేల కోట్ల రూపాయలను దాటిపోయింది. గుజరాత్‌, బనారస్‌లోని 17 దేవాలయాల ఆలయ ట్రస్టులను కూడా సమర్‌జిత్‌ సిన్హ్‌ రంజిత్‌ సింగ్‌ గైక్వాడ్‌ స్వయంగా నిర్వహిస్తున్నాడు. 2002లో సమర్జిత్‌సిన్హ్ వాంకనేర్ రాజకుటుంబానికి చెందిన రాధికా రాజేని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సమర్‌జిత్‌ సిన్హ్‌ రంజిత్‌ సింగ్‌ గైక్వాడ్‌ ఆస్తి 20 వేల కోట్లకు పైగానే ఉంటుందని తెలుసుకున్నాం కదా! మరి విరాట్‌ కోహ్లీ ఆదాయం ఎంత ఉంటుందనుకుంటున్నారు. 1,050 కోట్ల రూపాయలు.
ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లికి ఐకాన్‌ హోదాలో 15 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. ఒక టెస్టు మ్యాచ్‌కు కోహ్లి ఫీజు 15 లక్షల రూపాయలు ఉంది. ఒక వన్డే మ్యాచ్‌కు ఆరు లక్షలు ఇస్తున్నారు. అలాగే టి20 మ్యాచ్‌కు మూడు లక్షల రూపాయలను ఫీజు రూపంలో తీసుకుంటాడు. ఇక బీసీసీఐ అతనికి ఏప్లస్‌ కాంట్రాక్ట్‌లో చోటు కల్పించింది. ఈ లెక్కన కోహ్లికి వార్షిక కాంట్రాక్ట్‌ కింద ఏడాదికి 7 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక టీమిండియా మాజీ కెప్టెన్‌.. సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఆర్థిక ఆదాయం 1,040 కోట్ల రూపాయలకు పైమాటే.

Updated On 6 July 2023 6:50 AM GMT
Ehatv

Ehatv

Next Story