ఎందుకో డేవిడ్ వార్నర్(David Warner) మనవాడే అనిపిస్తాడు. ఒకప్పుడు హైదరాబాద్ టీమ్(Hyderabad Team)లో ఉన్నాడని కాదు కానీ, సోషల్ మీడియా(Social Media)తో మనకు బాగా తగ్గరయ్యాడు. అందుకే డేవిడ్ వార్నర్ ఆటనే చూసి ఎంజాయ్ చేస్తాము కానీ అతడి టీమ్ గెలిచిందా ఓడిందా అని పెద్దగా పట్టించుకోము. ఇప్పుడు డేవిడ్ వార్నర్ సారథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) వరుసగా నాలుగో ఓటమిని చవి చూసింది.
ఎందుకో డేవిడ్ వార్నర్(David Warner) మనవాడే అనిపిస్తాడు. ఒకప్పుడు హైదరాబాద్ టీమ్(Hyderabad Team)లో ఉన్నాడని కాదు కానీ, సోషల్ మీడియా(Social Media)తో మనకు బాగా తగ్గరయ్యాడు. అందుకే డేవిడ్ వార్నర్ ఆటనే చూసి ఎంజాయ్ చేస్తాము కానీ అతడి టీమ్ గెలిచిందా ఓడిందా అని పెద్దగా పట్టించుకోము. ఇప్పుడు డేవిడ్ వార్నర్ సారథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) వరుసగా నాలుగో ఓటమిని చవి చూసింది. అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium)లో జరిగిన మ్యాచ్‌లో ముంబాయి ఇండియన్స్(Mumbai Indians) ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయ్యింది. డేవిడ్ వార్నర్(David Warner), అక్షర్ పటేల్(Axar Patel)లు హాఫ్ సెంచరీలు చేశారు. ముంబాయి బౌలర్లలో బెహ్రెన్‌డార్ఫ్(Behrendorff), చావ్లా(Chawla)లు చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. మెరిడిత్(Meredith)రెండు వికెట్లు సాధించాడు. తర్వాత 173 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబాయి చివరి బంతికి గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విశేషమేమటింటే డేవిడ్ వార్నర్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు నమోదవ్వడం. ఐపీఎల్ టోర్నమెంట్‌లో 600 బౌండరీలు సాధించిన తొలి విదేశీ క్రికెటర్‌గా నిలిచాడు. ముంబాయితో జరిగిన మ్యాచ్‌లో ఆరు ఫోర్లు కొట్టిన వార్నర్ ఈ అరుదైన రికార్డును సాధించాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 728 బౌండరీలు సాధించి మొదటిస్థానంలో నిలిచాడు.