ఐపీఎల్-2024 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ సన్నాహాలు ప్రారంభించింది. ఈ ఏడాది పేలవమైన ప్రదర్శన తర్వాత.. జట్టులో పెద్ద మార్పు చేసింది. బ్రియాన్ లారా స్థానంలో అనుభవజ్ఞుడైన మాజీ ఆటగాడిని జట్టు ప్రధాన కోచ్‌గా నియమించింది.

ఐపీఎల్-2024 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) సన్నాహాలు ప్రారంభించింది. ఈ ఏడాది పేలవమైన ప్రదర్శన తర్వాత.. జట్టులో పెద్ద మార్పు చేసింది. బ్రియాన్ లారా(Brian Lara) స్థానంలో అనుభవజ్ఞుడైన మాజీ ఆటగాడిని జట్టు ప్రధాన కోచ్‌గా నియమించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్రియాన్ లారా స్థానంలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెటోరీ(Daniel Vettori)ని ప్రధాన కోచ్‌గా నియమించింది. లారా జట్టుకు రెండేళ్ల పాటు కోచ్‌గా ఉన్నాడు. ఆయ‌న శిక్ష‌ణ‌లో జట్టు ప్రదర్శన చాలా నిరాశపరిచింది. ఇలాంటి పరిస్థితుల్లో వెట్టోరీకి కోచ్ బాధ్యతలు అప్పగించారు. వెట్టోరి గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Banglore)కు ప్రధాన కోచ్‌(Head Coach)గా ఉన్నాడు.

లారాతో మాకు రెండేళ్ల అనుబంధం ఉంది.. అది ఇప్పుడు ముగుస్తోందని సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్వీట్ చేసింది. సన్‌రైజర్స్‌కు ఆయ‌న‌ చేసిన సేవ‌ల‌కు చాలా ధన్యవాదాలు. ఆయ‌న‌ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్(Tweet) చేసింది. అంత‌కుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్‌గా ఉన్న‌ టామ్ మూడీ స్థానంలో బ్రియాన్ లారా వచ్చాడు.

గత మూడు సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన చెప్పుకోద‌గ్గ‌ట్లుగా లేదు. 2023లో జట్టు 14 మ్యాచ్‌లలో నాలుగు విజయాలు, 10 ఓటములతో చివరి స్థానంలో ఉంది. దీంతో యాజ‌మాన్యం జట్టులో మార్పులు చేయడం ప్రారంభించింది.

డేనియల్ వెట్టోరి విష‌యానికొస్తే.. ఇంతకు ముందు కూడా ఐపిఎల్ కోచ్‌(IPL Coach)గా ప‌నిచేశాడు. వెట్టోరి 2014 నుండి 2018 వరకు రాయల్ ఛాలెంజర్స్ ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. అతని నాయకత్వంలోనే ఆర్సీబీ 2016 ఫైనల్‌కు చేరుకుంది. ఆర్సీబీ(RCB) ఫైనల్‌లో ఓటమి చవిచూసినప్పటికీ.. అతనికి సుదీర్ఘమైన కోచింగ్ అనుభవం ఉంది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ వెట్టోరిపై ఆశ‌లు పెట్టుకుంది. ప్ర‌స్తుతం ఆర్సీబీ ఆండీ ఫ్లవర్‌(Andi Flower)ను ప్రధాన కోచ్‌గా నియమించుకుంది.

Updated On 7 Aug 2023 10:50 PM GMT
Yagnik

Yagnik

Next Story