ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌(Chennai Super Kings) పేసర్‌ తుషార్‌ దేశ్‌పాండే(Pacer Tushar Deshpande) ఓ ఘనతను సాధించాడు. మొదటి ఇంపాక్ట్‌ ప్లేయర్‌(First Impact Player)గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. అహ్మదాబాద్‌(Ahmedabad)లో గుజరాత్‌ టైటాన్స్‌(Gurat Titans)తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు తలపడింది. మ్యాచ్‌ ఆరంభానికి ముందే చెన్నై జట్టు తుషార్‌ దేశ్‌పాండేను సబ్‌స్టిట్యూట్‌గా ప్రకటించింది. దీంతో ఐపీఎల్‌లో తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుషార్‌ పేరు నమోదయ్యింది.

ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌(Chennai Super Kings) పేసర్‌ తుషార్‌ దేశ్‌పాండే(Pacer Tushar Deshpande) ఓ ఘనతను సాధించాడు. మొదటి ఇంపాక్ట్‌ ప్లేయర్‌(First Impact Player)గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. అహ్మదాబాద్‌(Ahmedabad)లో గుజరాత్‌ టైటాన్స్‌(Gurat Titans)తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు తలపడింది. మ్యాచ్‌ ఆరంభానికి ముందే చెన్నై జట్టు తుషార్‌ దేశ్‌పాండేను సబ్‌స్టిట్యూట్‌గా ప్రకటించింది. దీంతో ఐపీఎల్‌లో తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుషార్‌ పేరు నమోదయ్యింది. చెన్నై టీమ్‌ బ్యాటింగ్‌ అయ్యాక బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడును ఫీల్డింగ్ సమయంలో తప్పించి అతడి ప్లేస్‌లో తుషార్‌ను బరిలో దింపింది. అయితే తుషార్‌ మాత్రం తుస్సుమనిపించాడు. 3.2 ఓవర్లు వేసిన తుషార్‌ 51 పరుగులిచ్చి ఒకే ఒక్క వికెట్‌ తీయగలిగాడు. విపరీతంగా పరుగులిచ్చాడు. మరోవైపు గుజరాత్‌ టీమ్‌ కూడా ఫీల్డింగ్‌లో గాయపడిన కేన్‌ విలియమ్సన్‌ ప్లేస్‌లో బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలో దింపింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అఫ్గనిస్తాన్‌ ప్లేయర్‌ రషీద్‌ఖాన్‌ అద్భుతమైన ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేశాడు. రెండు వికెట్లు తీయడంతో పాటు కీలకసమయంలో మూడు బంతుల్లో పది పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనను తొలిసారి ఈ టోర్నమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ నిబంధన ప్రకారం ఇన్నింగ్స్‌ ఆరంభానికి ముందుగానో ఓవర్‌ ముగిసిన తర్వాతో , వికెట్‌ పడినప్పుడో, లేదా బ్యాటర్‌ రిటైర్‌ అయినప్పుడో సబ్‌స్టిట్యూట్‌ను వాడుకోవచ్చు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన వాడుకునేటప్పుడు మ్యాచ్‌కు ముందు ఫైనల్‌ టీమ్‌తో పాటు నలుగురు సబ్‌స్టిట్యూట్‌ల పేర్లను ప్రకటించాల్సి ఉంటుంది. వారిలో ఒకరిని ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా తీసుకోవచ్చు. 11 మంది సభ్యుల జట్టులో విదేశీ ఆటగాళ్లు నలుగురు ఉంటే స్వదేశీ క్రికెటర్‌నే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంపిక చేయాలి. మ్యాచ్ పరిస్థితిని బట్టి జట్టుకు అవసరమైన సమయంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను బరిలో దింపవచ్చు. పిచ్‌ స్వభావానికి అనుగుణంగా బ్యాటర్‌కు బదులుగా బౌలర్‌ను తీసుకోవచ్చు. టార్గెట్‌ను ఛేజ్‌ చేస్తున్నప్పుడు అదనపు బ్యాటర్‌ కావాలని అనిపిస్తే ఒక బౌలర్‌ను తప్పించి అతడి ప్లేస్‌లో బ్యాటర్‌ను ఆడించవచ్చు. అయితే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ కోసం మైదానం వీడిన ప్లేయర్‌ మళ్లీ గ్రౌండ్‌లో అడుగుపెట్టే అవకాశం ఉండదు. అప్పటికే ఒక ఓవరో, రెండు ఓవర్లో బౌలింగ్‌ చేసిన బౌలర్‌ ప్లేస్‌లో వచ్చే ఇంపాక్ట్ ప్లేయర్‌ బౌలరే అయితే అతడు నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయవచ్చు. ముఖ్యమైన విషయమేమిటంటే సబ్‌స్టిట్యూట్‌గా వ్యవహరించే ఇంపాక్ట్ ప్లేయర్‌ కెప్టెన్‌గా మాత్రం వ్యవహరించకూడదు.

Updated On 1 April 2023 2:38 AM GMT
Ehatv

Ehatv

Next Story