చెన్నై సూపర్ కింగ్స్(CSK) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) మోకాలికి శస్త్ర చికిత్స(Knee Treatment) చేయించుకున్నాడు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. మూడు వారాల విశ్రాంతి తర్వాత.. రాంచీ(Ranchi) వెళ్లి ఫిట్‌నెస్ శిక్షణ(Fitness Training) ప్రారంభించనున్నారు. ఈ క్ర‌మంలోనే చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ(CSK CEO) కాశీ విశ్వనాథన్(Kasi Viswanathan) ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో జరిగిన సంభాషణలో మాట్లాడుతూ..

చెన్నై సూపర్ కింగ్స్(CSK) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) మోకాలికి శస్త్ర చికిత్స(Knee Treatment) చేయించుకున్నాడు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. మూడు వారాల విశ్రాంతి తర్వాత.. రాంచీ(Ranchi) వెళ్లి ఫిట్‌నెస్ శిక్షణ(Fitness Training) ప్రారంభించనున్నారు. ఈ క్ర‌మంలోనే చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ(CSK CEO) కాశీ విశ్వనాథన్(Kasi Viswanathan) ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో జరిగిన సంభాషణలో మాట్లాడుతూ.. చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడారు. మోకాలి గాయంతో(Knee Injury) ధోనీ ఐపీఎల్ 2023(IPL 2023) సీజన్ మొత్తం ఆడాడని, దాని గురించి ఒక్కసారి కూడా ఫిర్యాదు చేయలేదని చెప్పాడు. తన జట్టు ఐదో ఐపీఎల్ టైటిల్ గెలిచిన‌ తర్వాత, ధోనీ ముంబై వెళ్లి శస్త్రచికిత్స చేయించుకుంటానని చెప్పాడు. ఇప్పుడు శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకుంటున్నాడని పేర్కొన్నారు.

"మీరు ఆడాల‌నుకుంటున్నారా లేదా బయట కూర్చోవాలనుకుంటున్నారా వంటి విషయాలు మేము ధోనీని ఎప్పుడూ అడగలేదని కాశీ చెప్పాడు. ధోనీ ఆడలేకపోతే.. మాకు నేరుగా చెప్పేవాడు. ధోనీకి జట్టు పట్ల ఉన్న‌ నిబద్ధత, అతని నాయకత్వం(Captaincy), జట్టుకు ఎలా ఉపయోగపడుతుందో అందరికీ తెలుసు. ఆ కోణం నుండి మ‌నం ధోనీని అభినందించాలి. ఫైనల్ వరకు.. ధోనీ తన మోకాలి గురించి ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ధోనీ నడుస్తున్నప్పుడు కష్టపడటం అంద‌రూ చూసినప్పటికీ.. అతను ఒక్కసారి కూడా ఫిర్యాదు చేయలేదు. ఫైనల్ అయ్యాక 'సరే, సర్జరీకి వెళ్తాను' అన్నాడు. ధోనీ తన శస్త్రచికిత్సను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ధోనీ కోలుకుంటున్నాడు.. చాలా సంతోషంగా ఉన్నాడని తెలిపాడు.

ధోనీ టైటిల్ గెలిచిన తర్వాత రిటైర్మెంట్‌పై స్పందించాడు. ఇది రిటైర్మెంట్‌కు "ఉత్తమ సమయం" అని చెప్పాడు. అయితే శరీరం స‌హ‌క‌రిస్తే "కనీసం" మరో సీజన్ ఆడ‌టానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. రాబోయే తొమ్మిది నెలలు "కఠినంగా" శిక్షణ తీసుకుంటే ధోనీ మ‌రో సీజ‌న్ ఆడే అవ‌కాశం ఉంద‌ని అభిమానులు భావిస్తున్నారు. సర్జరీ తర్వాత మూడు వారాల విశ్రాంతి తీసుకోనున్న‌ ధోని.. త్వరలో పునరావాసం ప్రారంభించనున్నాడు.

Updated On 22 Jun 2023 1:06 AM GMT
Ehatv

Ehatv

Next Story