ఇండియా-పాకిస్తాన్‌(India Vs Pakistan) మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌కు ఎంత క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరకాల ప్రత్యర్థులు బరిలో దిగుతున్నారంటే చాలు మ్యాచ్‌ టికెట్లు నిమిషాల్లో తెగిపోతాయి. పోరు ఎక్కడ జరిగినా అభిమానులు రెక్కలు కట్టుకుని వాలిపోతారు. శనివారం అహ్మదాబాద్‌(Ahmedabad)లో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ప్రపంచకప్‌ మ్యాచ్‌ జరగబోతున్నది.

ఇండియా-పాకిస్తాన్‌(India Vs Pakistan) మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌కు ఎంత క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరకాల ప్రత్యర్థులు బరిలో దిగుతున్నారంటే చాలు మ్యాచ్‌ టికెట్లు నిమిషాల్లో తెగిపోతాయి. పోరు ఎక్కడ జరిగినా అభిమానులు రెక్కలు కట్టుకుని వాలిపోతారు. శనివారం అహ్మదాబాద్‌(Ahmedabad)లో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ప్రపంచకప్‌ మ్యాచ్‌ జరగబోతున్నది. ఈ పోటీని చూడటానికి అభిమానులు ఉత్సాహపడుతున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి బయట ప్రాంతాల నుంచి అభిమానులు అహ్మదాబాద్‌కు వచ్చేశారు. కొంతమంది అభిమానులు ఆసుపత్రుల్లో మకాం వేశారు. మ్యాచ్‌కు ముందే వీరికి బీపీలు వచ్చాయనుకునేరు! ఆసుపత్రులలో ఉన్నవారు సలక్షణంగానే ఉన్నారు. మరి హాస్పిటల్స్‌లో ఎందుకు ఉండటం అంటే.. ఇప్పటికే హోటల్‌ గదులన్నీ కిటకిటలాడుతున్నాయి. మామూలు రేట్ల కంటే 20 శాతం రేట్లను హోటల్‌ యజమానులు పెంచేశారు. 20 శాతమేం ఖర్మ.. 50 శాతం పెంచినా బుక్‌ చేసుకోడానికి ఫ్యాన్స్‌ సిద్ధంగా ఉన్నారు. అయినా గదులు దొరకడం లేదు. మ్యాచ్‌ చూసేందుకు అంతేసి దూరాల నుంచి వచ్చిన వారు ఆ ఆసక్తికరమైన పోరును చూడకుండా వెనక్కి వెళ్లలేరు కదా! అందుకే స్థానికంగా ఉన్న ఆసుపత్రులలో ఆరోగ్య పరీక్షల ప్యాకేజీలు తీసుకుని బెడ్‌లు బుక్‌ చేసుకుంటున్నారు. మ్యాచ్‌ సమయానికి వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. దీని వల్ల అటు వైద్య పరీక్షలు పూర్తవడంతో పాటు మ్యాచ్‌ను కూడా ప్రత్యక్షంగా చూసే ఛాన్స్‌ దొరుకుతుంది. క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆలోచన పసిగట్టిన కొన్ని ఆసుపత్రులు రోగులకు తప్ప ఇతరులకు ఇవ్వడానికి ససేమిరా అంటున్నాయి..

Updated On 12 Oct 2023 11:50 PM GMT
Ehatv

Ehatv

Next Story