ఆస్ట్రేలియా(australia) క్రికెట్ జట్టు మాజీ టెస్టు కెప్టెన్ బ్రియాన్ బూత్(Brian Booth) (89) కన్నుమూశారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. బ్రియాన్ బూత్ మరణంపై క్రికెట్(Cricket) ప్రపంచం సంతాపం వ్య‌క్తం చేస్తుంది.

ఆస్ట్రేలియా(australia) క్రికెట్ జట్టు మాజీ టెస్టు కెప్టెన్ బ్రియాన్ బూత్(Brian Booth) (89) కన్నుమూశారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. బ్రియాన్ బూత్ మరణంపై క్రికెట్(Cricket) ప్రపంచం సంతాపం వ్య‌క్తం చేస్తుంది. బ్రియాన్ బూత్ 29 టెస్టుల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లాండ్‌తో 1965-66 జరిగిన యాషెస్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా ఉన్నాడు. అతను ఆస్ట్రేలియా తరఫున 29 టెస్టుల్లో 42.21 సగటుతో 1773 పరుగులు చేశాడు.

బ్రియాన్ బూత్.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. స్వదేశంలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై సెంచరీ కూడా సాధించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హాక్లీ.. బూత్ మ‌ర‌ణం క్రికెట్ ఆస్ట్రేలియాకు పెద్ద లోట‌ని అన్నారు. ఆయ‌ప‌ ప్రశాంతమైన ప్రవర్తన ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని క్రికెట్ న్యూసౌత్ వేల్స్ సీఈఓ లీ జర్మాన్ అన్నారు. బ్రియన్ బూత్ మరణం ప‌ట్ల‌ మేము చాలా బాధపడ్డాము. కెప్టెన్‌గా బ్రియాన్ రికార్డు చరిత్రలో నిలిచిపోయింది. ఆయ‌న‌ హోమ్ ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా తరపున హాకీ ఆడటం.. అథ్లెట్‌గా ఎంతో ప్రత్యేకమైనదని లీ జర్మాన్ అన్నారు.

Updated On 20 May 2023 1:58 AM GMT
Ehatv

Ehatv

Next Story