వన్డే ప్రపంచ క‌ప్(One day World Cup) కంటే ముందు ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికా, భారత్‌తో సిరీస్‌లు ఆడాల్సి ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగే 3-మ్యాచ్‌ల T20 సిరీస్ కోసం కూడా క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఇందులో మిచెల్ మార్ష్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా కూడా జట్టులో చోటు సంపాదించాడు.

భారత్‌లో(India) అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్(One Day World Cup) కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా 18 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. ఈ జట్టు దక్షిణాఫ్రికా, భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లలో కూడా ఆడనుంది. ప్రపంచకప్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన ప్రిలిమినరీ టీమ్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్ మార్నస్ లాబుషాగ్నేకు చోటు దక్కలేదు.

వన్డే ప్రపంచ క‌ప్(One day World Cup) కంటే ముందు ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికా, భారత్‌తో సిరీస్‌లు ఆడాల్సి ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగే 3-మ్యాచ్‌ల T20 సిరీస్ కోసం కూడా క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఇందులో మిచెల్ మార్ష్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా కూడా జట్టులో చోటు సంపాదించాడు.

కంగారూ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనను మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో ప్రారంభిస్తుంది. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు గ్లెన్ మాక్స్‌వెల్ అందుబాటులో ఉండ‌టం లేదు. పాట్ కమిన్స్ గాయం కారణంగా.. మిచెల్ మార్ష్ జట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించనున్నాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 7 నుంచి 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమిండియా ఆడనుంది.

ప్రపంచ కప్ జ‌ట్టు..

డేవిడ్ వార్నర్(David Warner), ట్రావిస్ హెడ్(Travis Head), స్టీవ్ స్మిత్(Steve Smith), గ్లెన్ మాక్స్‌వెల్, జోస్ ఇంగ్లీష్, అలెక్స్ కారీ, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, సీన్ అబాట్, ఆస్టన్ అగర్, ఆడమ్ జంపా, తన్వీర్ సంగ, పాట్ కమిన్స్ (సి), మిచెల్ స్టార్క్ , జోష్ హాజిల్‌వుడ్, నాథన్ ఎల్లిస్.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు జ‌ట్టు..

మాట్ షార్ట్, టిమ్ డేవిడ్స్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, జోష్ ఇంగ్లీష్, మార్కస్ స్టోయినిస్, నాథన్ ఎల్లిస్, స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్, స్పిన్నర్ జాన్సన్, ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, ఆడమ్ జంపా, గ్లెన్ మాక్స్‌వెల్, సీన్ అబాట్.

Updated On 8 Aug 2023 6:07 AM GMT
Ehatv

Ehatv

Next Story