కరీంనగర్ జిల్లా(Karimnagar district) హుస్నాబాద్ మండలం(Husnabad Mandal)లో విషాదం చోటు చేసుకుంది. చిగురుమామిడి మండలానికి చెందిన 37ఏళ్ల ఆంజనేయులు క్రికెట్ ఆడుతూ గుండెపోటు(heart attack)తో చనిపోయాడు. కేఎమ్‌ఆర్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్న ఆంజనేయుడు బౌలింగ్ వేస్తూ కుప్పకూలిపోయాడు. తోటి ఆటగాళ్లు ఆసుప్రతికి తరలించేలోపుగానే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది.
కరీంనగర్ జిల్లా(Karimnagar district) హుస్నాబాద్ మండలం(Husnabad Mandal)లో విషాదం చోటు చేసుకుంది. చిగురుమామిడి మండలానికి చెందిన 37ఏళ్ల ఆంజనేయులు క్రికెట్ ఆడుతూ గుండెపోటు(heart attack)తో చనిపోయాడు. కేఎమ్‌ఆర్ క్రికెట్ టోర్నమెంట్(KMR Cricket Tournament)లో పాల్గొన్న ఆంజనేయుడు(Anjaneyudu)బౌలింగ్ వేస్తూ కుప్పకూలిపోయాడు. తోటి ఆటగాళ్లు ఆసుప్రతికి తరలించేలోపుగానే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. స్కూలు పిల్లలు కూడా గుండెపోటుతో చనిపోతుండటం విషాదం. ఆకస్మిక గుండెపోటు మరణాలు కలిచివేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండె ఆగిపోతుండటం భయాన్ని కలిగిస్తోంది. జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తూ చనిపోతున్నారు. ఆటలాడుతూ మరణిస్తున్నారు. కుర్చిలో కూర్చొని కన్నుమూస్తున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కల్తీ ఆహారం, వేళకు తిండితినకపోవడం, కంటినిండా నిద్రలేకపోవడం, పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు.. ఇవన్నీ గుండె ఆగిపోవడానికి కారణాలు. కోవిడ్ నుంచి కోలుకున్నవారికి గుండెపోటు ఎక్కువగా వస్తున్నదట. రోగనిరోధక శక్తి తగ్గడమే ఇందుకు కారణమని వైద్యులు అంటున్నారు.
శారీరక వ్యాయామం, పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు నిర్వహించుకుంటే గుండెపోటు మరణాలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్లు.
గుండెనొప్పి సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే.. మొదట శరీరపై భాగం నుంచి ఎడమచేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తుంది. అప్పుడే అలెర్టవ్వాలి. ఆ తర్వాత శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఆయాసం వస్తుంది. గుండెలో మంట మొదలవుతుంది. చెమటలు పడతాయి. ఒళ్లు నొప్పులు వస్తాయి. అప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలోనే గుండెపోటు వస్తే ఫస్ట్ ఎయిడ్‌తో ప్రాణం నిలపవచ్చు. సీపీఆర్ చేస్తే గుండెపోటు గురైన వ్యక్తిని బతికించవచ్చు. సిగరెట్, మందు పూర్తిగా మానేయడం మంచిది. పండ్లు, కూరగాయలు బాగా తీసుకోవాలి. జంక్ ఫుడ్డుకు దూరంగా ఉండాలి. మాంసాహారం పరిమితంగా తీసుకోవాలి. ఛాతీలో నొప్పి వస్తే ఈసీజీ చేయించుకోవాలి. గుండె స్పందన, గుండె కండరాలలో వచ్చిన మార్పులు తెలుసుకోవాలంటే 2డీ ఇకో పరీక్ష చేయించుకోవాలి. ట్రెడ్‌మిల్‌పై వేగంగా నడిపించి తద్వార గుండెపై ఒత్తిడి ఎలా ఉందన్నది కూడా పరీక్షిస్తారు. ఈసీజీ, 2డీ ఇకో టెస్టులలో స్పష్టత రాకపోతే అప్పుడు ఎంజియోగ్రామ్ చేస్తారు. గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ అరగంటపాటు వ్యాయామం చేయాలి. ఏడేనిమిది గంటలు నిద్రపోవాలి. వీలున్నవారు మధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం మంచిది. మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు యోగా, ధ్యానం చేయాలి.. డాక్టర్ల సూచనలు తప్పనిసరిగా పాటించాలి. వారిచ్చే మెడిసిన్స్ క్రమం తప్పకుండా వాడాలి.