టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) పై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఘన విజయం సాధించింది. 138 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. రుతురాజ్ గైక్వాడ్ అర్ధశతకం (67 నాటౌట్) తో రాణించాడు. దూబే 18 బంతుల్లోనే 3 సిక్సర్లు, ఒక బౌండరీ సాయంతో 28 రన్స్ చేశాడు. డారెల్ మిచెల్ 19 బంతుల్లో 25 పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు, నరైన్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్‌కు ఇదే తొలి పరాజయం. చెన్నై మూడో విజయాన్ని నమోదు చేసింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 137 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (0) ఇన్నింగ్స్ తొలి బంతికే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ సునీల్ నరైన్ 20 బంతుల్లో 27 పరుగులు చేశాడు. రఘువంశీ 24 రన్స్ చేయగా.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 34 పరుగులతో రాణించాడు. రింకూ సింగ్ (09), ఆండ్రీ రసెల్ (10) ఘోరంగా ఆడారు. రవీంద్ర జడేజా 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. తుషార్ దేశ్‌పాండే 3, ముస్తాఫీజుర్ 2, తీక్షణ 1 వికెట్ పడగొట్టారు.