నాలుగుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌(IPL Title)ను గెల్చుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌(Chennai Super Kings) ఈసారి ఆరంభపోరులో ఎందుకో తడబడింది. భారీ స్కోరు సాధించినా ఓటమి మూటగట్టుకుంది. ఆ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకున్న చెన్నై రెండో మ్యాచ్‌లో చెలరేగిపోయింది. నాలుగేళ్ల తర్వాత సొంతగడ్డపై మ్యాచ్‌ ఆడుతున్న చెన్నై చెపాక్‌ స్టేడియం(Chennai Chepauk Stadium)లో పరుగుల వరద పారించింది.

నాలుగుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌(IPL Title)ను గెల్చుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌(Chennai Super Kings) ఈసారి ఆరంభపోరులో ఎందుకో తడబడింది. భారీ స్కోరు సాధించినా ఓటమి మూటగట్టుకుంది. ఆ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకున్న చెన్నై రెండో మ్యాచ్‌లో చెలరేగిపోయింది. నాలుగేళ్ల తర్వాత సొంతగడ్డపై మ్యాచ్‌ ఆడుతున్న చెన్నై చెపాక్‌ స్టేడియం(Chennai Chepauk Stadium)లో పరుగుల వరద పారించింది. ఓపెనర్లు రుతురాజ్‌(Ruturaj), కాన్వే(Conway)లు మెరుపులు మెరిపిస్తే మెయిన్‌ అలీ స్పిన్‌కు ప్రత్యర్థి బ్యాటర్లు దాసోహమయ్యారు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ 31 బంతుల్లో మూడు బౌండరీలు, నాలుగు సిక్సర్లతో 57 పరుగులు చేయగా, డెవాన్‌ కాన్వే 29 బంతుల్లో అయిదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. రుతురాజ్‌కు ఇది వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ కావడం విశేషం. రవి బిష్ణోయ్‌, మార్క్‌వుడ్‌లకు చెరో మూడు వికెట్లు దక్కాయి. తర్వాత బరిలో దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. కైల్‌ మేయర్స్‌ 22 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ మొయిన్‌ అలీ 26 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు.

చెన్నై ఓపెనర్లు దూకుడుగా ఆడారు. ఫలితండా 56 బంతుల్లోనే 110 పరుగులు వచ్చాయి. రుతురాజ్‌, కాన్వేలు లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆవేశ్‌ వేసిన ఓవర్‌లో కాన్వే రెండు ఫోర్లు సాధించగా, గౌతమ్‌ వేసిన ఓవర్‌లో రుతురాజ్‌ మూడు సిక్సర్లు సాధించాడు. 25 బంతుల్లోనే రుతురాజ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు కృనాల్‌ ఓవర్లో కాన్వే రెండు సిక్సర్లు కొట్టాడు. బిష్ణోయ్‌ తన తొలి బంతికే రుతురాజ్‌ను అవుట్‌ చేయడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత కొద్ది సేపటికే కాన్వే అవుట్‌ అయ్యాడు. మూడో స్థానంలో వచ్చిన శివమ్‌ దూబే 16 బంతుల్లో ఒక బౌండరీ, మూడు సిక్సర్లతో 27 పరుగులు చేశాడు. ఇతడిని కూడా బిష్ణోయ్‌ పెవిలియన్‌కు పంపించాడు. అవేశ్‌ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన మొయిన్‌ అలీని కూడా బిష్ణోయ్‌ అవుట్‌ చేశాడు. స్టోక్స్‌ (8), జడేజా (3) పెద్దగా పరుగులు చేయలేకపోయారు. చివర్లో అంబటి రాయుడు 14 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 27 పరుగులు చేయడంతో చెన్నై స్కోరు 200 దాటింది. ధోనీ ఆడిన మూడు బంతుల్లో రెండు భారీ సిక్సర్లు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో ఏడు బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌ కొట్టిన ధోనీ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అయిదు వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. కోహ్లి, ధావన్‌, వార్నర్‌, రోహిత్‌, రైనా, డి విలియర్స్‌ తర్వాత ఈ ఫీట్‌ సాధించిన ఆటగాడు ధోనీనే.
తర్వాత బరిలో దిగిన లక్నోకు ఓపెనర్లు శుభారంభాన్నే ఇచ్చారు. 35 బంతుల్లోనే 79 పరుగులు జోడించారు. కైల్‌ మేయర్స్‌ 22 బంతుల్లో ఎనిమిది బౌండరీలు, రెండు సిక్సర్లతో 53 పరుగులు చేసి కాసేపు చెన్నైను వణికించాడు. మేయర్స్‌ అవుటయ్యాక లక్నో మళ్లీ కోలుకోలేకపోయింది.

స్కోరు బోర్డు
చెన్నై సూపర్‌ కింగ్స్‌(Chennai Super Kings)
రుతురాజ్‌ (సి) వుడ్‌ (బి) బిష్ణోయ్‌ 57; కాన్వే (సి) కృనాల్‌ (బి) వుడ్‌ 47; దూబే (సి) వుడ్‌ (బి) బిష్ణోయ్‌ 27; అలీ (స్టంప్డ్‌) పూరన్‌ (బి) బిష్ణోయ్‌ 19; స్టోక్స్‌ (సి) యష్‌ (బి) అవేశ్‌ 8; రాయుడు (నాటౌట్‌) 27; జడేజా (సి) బిష్ణోయ్‌ (బి) వుడ్‌ 3; ధోని (సి) బిష్ణోయ్‌ (బి) వుడ్‌ 12; సాన్‌ట్నర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 217.
వికెట్ల పతనం: 1–110, 2–118, 3–150, 4–166, 5–178, 6–203, 7–215.
బౌలింగ్‌: మేయర్స్‌ 2–0–16–0, అవేశ్‌ 3–0–39–1, కృనాల్‌ 2–0–21–0, గౌతమ్‌ 1–0–20–0, వుడ్‌ 4–0–49–3, యష్‌ ఠాకూర్‌ 4–0–36–0, రవి బిష్ణోయ్‌ 4–0–28–3.

లక్నో సూపర్‌జెయింట్స్‌(Lucknow Super Giants)
రాహుల్‌ (సి) రుతురాజ్‌ (బి) అలీ 20; మేయర్స్‌ (సి) కాన్వే (బి) అలీ 53; హుడా (సి) స్టోక్స్‌ (బి) సాన్‌ట్నర్‌ 2; కృనాల్‌ (సి) జడేజా (బి) అలీ 9; స్టొయినిస్‌ (బి) అలీ 21; పూరన్‌ (సి) స్టోక్స్‌ (బి) తుషార్‌ 32; బదోని (సి) ధోని (బి) తుషార్‌ 23; గౌతమ్‌ (నాటౌట్‌) 17; వుడ్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–79, 2–82, 3–82, 4–105, 5–130, 6–156, 7–195.
బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–55–0, స్టోక్స్‌ 1–0–18–0, తుషార్‌ 4–0–45–2, మొయిన్‌ అలీ 4–0–26–4, సాన్‌ట్నర్‌ 4–0–21–1, రాజ్‌వర్ధన్‌ 2–0–24–0, జడేజా 1–0–14–0.

Updated On 3 April 2023 11:35 PM GMT
Ehatv

Ehatv

Next Story