ఐపీఎల్‌-18లో బాల్ ట్యాంపరింగ్ జరిగిందన్న ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి.

ఐపీఎల్‌-18లో బాల్ ట్యాంపరింగ్ జరిగిందన్న ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌(Chennai Super Kings) బౌలర్‌ ఖలీల్ అహ్మద్‌ (Khaleel Ahmed)బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో ఖలీల్‌ అహ్మద్‌ తన జేబు నుంచి ఏదో వస్తువు తీసి కెప్టెన్‌ గైక్వాడ్‌(Rituraj Gaikwad)కు ఇచ్చాడు. కెప్టెన్‌ గైక్వాడ్‌ కూడా దానిని తన జేబులో పెట్టుకున్నాడు. దీనిని గమనించిన కొందరు మాత్రం బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఐపీఎల్ 2025(IPl 2025)లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్(MI) జట్లు చెపాక్ స్టేడియం వేదికగా మూడో మ్యాచ్‌లో పాల్గొన్నాయి. టాస్‌ గెలిచిన సీఎస్‌కే(CSK) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. సీఎస్కే పేస్ బౌలర్ ఖలీల్ అహ్మద్ ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టును దెబ్బతీశాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన ఖలీల్ 29 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), ర్యాన్ రికెల్టన్ వికెట్లు తీసి ముంబై ఇండియన్స్‌ జట్టుకు పెద్ద దేబ్బే వేశాడు.

అయితే ఖలీల్ అహ్మద్ చేతిలో బంతి ఉన్నప్పుడు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అతని దగ్గరకు వెళ్లాడు. అదే సమయంలో ఖలీల్ అహ్మద్ తన జేబులో నుంచి ఏదో తీసి కెప్టెన్‌కు ఇచ్చాడు. రుతురాజ్ కూడా దాన్ని వెంటనే జేబులో పెట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఖలీల్ అహ్మద్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడని ముంబై, ఆర్సీబీ అభిమానులు సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడిన సీఎస్‌కే బౌలర్‌పై చర్యలు తీసుకోవాలని కోరగా.. అది ట్యాంపరింగ్‌ చేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవని సీఎస్‌కే ఫ్యాన్స్‌ వాదిస్తున్నారు.

మ్యాచ్ గురించి చెప్పాలంటే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రోహిత్ శర్మ డకౌట్ అవ్వగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Surya kumar yadav) 29, తిలక్ వర్మ(Tilak varma) 31 పరుగులు రాబట్టారు. దీపక్ చాహర్(Deepak Chahar) 15 బంతుల్లో 28 పరుగులతో రాణించడంతో ఆ మాత్రం స్కోర్‌ చేసింది ముంబై ఇండియన్స్‌ జట్టు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్ నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసుకోగా, నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్, ఎలీస్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అలవోకగా మ్యాచ్‌ గెలిచింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, ఓపెనర్ రచిన్ రవీంద్ర 45 బంతుల్లో 65 పరుగులతో నాటౌట్‌గా నిలిచి విన్నింగ్ షాట్‌తో మ్యాచ్‌ని ముగించాడు. ముంబై బౌలర్లలో యువ ఆటగాడు విఘ్నేశ్ పుతుర్ మూడు వికెట్లు పడగొట్టగా.. విల్ జాక్స్, దీపక్ చాహర్ చెరో వికెట్ తీశారు.

ehatv

ehatv

Next Story