2023 ఆసియా కప్(2023 Asia Cup) ఫైనల్లో శ్రీలంక(Sri Lanka)ను ఓడించి టీమ్ ఇండియా(Team India) టైటిల్ గెలుచుకుంది. ఆసియా కప్ ముగియ‌డంతో భారత జట్టు ప్రపంచ కప్ 2023(World Cup 2023)పై దృష్టి పెట్టింది. అయితే కొందరు ముఖ్యమైన ఆటగాళ్లకు గాయాలు అవ‌డంతో జట్టు మేనేజ్‌మెంట్‌లో టెన్షన్‌ను పెరుగుతుంది.

2023 ఆసియా కప్(2023 Asia Cup) ఫైనల్లో శ్రీలంక(Sri Lanka)ను ఓడించి టీమ్ ఇండియా(Team India) టైటిల్ గెలుచుకుంది. ఆసియా కప్ ముగియ‌డంతో భారత జట్టు ప్రపంచ కప్ 2023(World Cup 2023)పై దృష్టి పెట్టింది. అయితే కొందరు ముఖ్యమైన ఆటగాళ్లకు గాయాలు అవ‌డంతో జట్టు మేనేజ్‌మెంట్‌లో టెన్షన్‌ను పెరుగుతుంది. వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ప్ర‌క‌టించిన‌ జాబితాలో ఉన్న‌ అక్షర్ పటేల్(Axar Patel), శ్రేయాస్ అయ్యర్‌(Shreyas Iyer)లు గాయాల బారిన‌ ప‌డ‌టం ఆ టెన్ష‌న్‌కు కార‌ణం. కాగా, వీరిద్దరి ఫిట్‌నెస్‌పై కెప్టెన్ రోహిత్(Rohit Sharma) అప్‌డేట్ ఇచ్చాడు.

శ్రీలంకపై అద్భుత విజయం తర్వాత విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. అక్షర్ గాయాన్ని చూస్తుంటే.. అతడు ఒక వారం లేదా 10 రోజుల్లో కోలుకుంటాడని నేను అనుకుంటున్నాను. నాకు తెలియదు. మరి అతడి గాయానికి ఎంత సమయం పడుతుందో చూడాలి. కొంతమంది ఆటగాళ్ళు చాలా త్వరగా కోలుకుంటారు. అక్షర్ పటేల్ విషయంలో కూడా అదే జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అక్షర్ ఆస్ట్రేలియాతో మొదటి రెండు వన్డేలు ఆడగలడా లేదా అనేది నాకు ఖచ్చితంగా తెలియదని పేర్కొన్నాడు.

శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. శ్రేయస్ ఫైనల్ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. శ్రేయస్ త‌ను అనుకున్న‌దాంట్లో విజయం సాధించాల‌ని నేను భావిస్తున్నాను. త‌ను 99 శాతం ఫిట్‌గా ఉన్నాడని నేను ప్రస్తుతం చెప్పగలను. శ్రేయస్ చాలా ఫిట్‌గా కనిపిస్తాడు. చాలా గంటలు బ్యాటింగ్, ఫీల్డింగ్ చేశాడు. శ్రేయస్ ఫిట్‌నెస్ ఆందోళన కలిగించే విషయం అని నేను అనుకోను.

Updated On 18 Sep 2023 3:31 AM GMT
Ehatv

Ehatv

Next Story