వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లండ్(England)తో జరిగే తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉంటానని చెప్పిన టీమిండియా(Team india) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) ఇప్పుడు మిగతా మూడు మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. చివరి మూడు టెస్ట్ మ్యాచ్‌లకు ఇవాళ టీమ్‌ను ప్రకటించాల్సి ఉంది
వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లండ్(England)తో జరిగే తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉంటానని చెప్పిన టీమిండియా(Team india) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) ఇప్పుడు మిగతా మూడు మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. చివరి మూడు టెస్ట్ మ్యాచ్‌లకు ఇవాళ టీమ్‌ను ప్రకటించాల్సి ఉంది. అయితే విరాట్ కోహ్లీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదని బీసీసీఐ ప్రతినిధి ఒకరు చెప్పారు. విరాట్ కోహ్లీ తల్లి సరోజ్ కోహ్లి(Saroj Kohli) తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని, ఆమెను దగ్గరుండి చూసుకునేందుకే కోహ్లి మిగతా టెస్ట్‌లకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడని సోషల్ మీడియా(Social Media)లో ఒకటే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే మాత్రం టీమిండియాకు ఒకింత కష్టమే. ఎందుకంటే ఇప్పటికే గాయాల కారణంగా కె.ఎల్.రాహుల్(KL Rahul), రవీంద్ర జడేజా(Ravindra Jadeja)లు రెండో టెస్ట్‌కు దూరమయ్యారు. కోహ్లీ కూడా టీమ్‌కు దూరమైతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. హైదరాబాద్(Hyderabad)లో జరిగిన మొదటి టెస్ట్‌లో టీమిండియా ఓటమిపాలైంది. అయిదు టెస్ట్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకబడి ఉన్న టీమిండియాకు ఇది సంకటస్థితి అనే చెప్పవచ్చు. విరాట్ కోహ్లి, కె.ఎల్. రాహుల్, రవీంద్ర జడేజాల స్థానాల్లో రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ లాంటి యువ ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు కానీ అనుభవలేమి కాసింత కంగారుపెట్టిస్తోంది. సీనియర్ల స్థాయి ప్రదర్శన వీరి నుంచి ఆశించలేము.
ఇంగ్లండ్‌తో జరుగబోయే మూడు, నాలుగు, అయిదు టెస్ట్‌ల కోసం భారత జట్టును ఇవాళ ప్రకటిస్తారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి మొదలయ్యే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం వైజాగ్ స్టేడియం రెడీ అయ్యింది.