ఇంగ్లండ్‌(England)-ఇండియా(India) మధ్య జరుగుతోన్న టెస్ట్‌ సిరీస్‌(Test series) రంజుగా సాగుతోంది. హైదరాబాద్‌లో(Hyderabad) జరిగిన ఓటమికి వైజాగ్‌లో(Vizag) బదులు తీర్చుకున్న టీమిండియా ఇప్పుడు మిగిలిన మూడు టెస్ట్‌లకు సంసిద్ధమవుతోంది.

ఇంగ్లండ్‌(England)-ఇండియా(India) మధ్య జరుగుతోన్న టెస్ట్‌ సిరీస్‌(Test series) రంజుగా సాగుతోంది. హైదరాబాద్‌లో(Hyderabad) జరిగిన ఓటమికి వైజాగ్‌లో(Vizag) బదులు తీర్చుకున్న టీమిండియా ఇప్పుడు మిగిలిన మూడు టెస్ట్‌లకు సంసిద్ధమవుతోంది. ఈ మూడు టెస్ట్‌ మ్యాచ్‌లకు గాను టీమిండియాను బీసీసీఐ(BCCI) సెలెక్షన్‌ కమిటీ ఇవాళ ప్రకటించనుంది. అజిత్ అగార్కర్(Ajit Agarkar) నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ మంగళవారం ముంబాయిలో భేటీ కానుంది. జట్టు ఎంపికతో పాటు కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి విరాట్‌ కోహ్లీ(Virat Kohli) పైనే ఉంది. వ్యక్తిగత కారణాలతో మొదటి రెండు టెస్ట్‌లకు దూరంగా ఉన్న కోహ్లీ మూడో టెస్ట్‌కైనా అందుబాటులోకి వస్తాడా లేడా అన్నది ఆసక్తి రేపుతోంది. మూడో టెస్ట్‌ మ్యాచ్‌ ఈ నెల 15వ తేదీ నుంచి రాజ్‌కోట్‌లో మొదలవుతున్నది. అంటే మరో పది రోజులసమయం ఉంది కాబట్టి విరాట్ కోహ్లీ జట్టు ఎంపికకు అందుబాటులో ఉండాలని అంటున్నారు. ప్రస్తుతం విరాట్‌ లండన్‌లో(London) ఉన్నారు. ఇదిలా ఉంటే మూడో టెస్ట్‌కు జస్‌ప్రీత్‌ బుమ్రాకు(Jasprit Bumrah) విశ్రాంతి ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారట!

Updated On 6 Feb 2024 1:17 AM GMT
Ehatv

Ehatv

Next Story