ఐసీసీ వన్డే ప్రపంచకప్‌(ICC WordCup) టోర్నమెంట్ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ఈ మెగా క్రికెట్ పోటీలకు(Cricket) భారత్‌(India) ఆతిథ్యమిస్తోంది. పుష్కర కాలం తర్వాత భారత్‌లో వన్డే ప్రపంచకప్‌(One day worldcup) పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. వార్మప్‌ మ్యాచ్‌లు కూడా ముగిసాయి. ఇదిలాఉంటే ఐసీసీ వన్డే ప్రపంచ కప్(ICC worldcup Tornment) టోర్నమెంట్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్‌ బోర్డుకు(Cricket Board) మరో ఆటంకం వచ్చి పడింది.

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌(ICC WordCup) టోర్నమెంట్ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ఈ మెగా క్రికెట్ పోటీలకు(Cricket) భారత్‌(India) ఆతిథ్యమిస్తోంది. పుష్కర కాలం తర్వాత భారత్‌లో వన్డే ప్రపంచకప్‌(One day worldcup) పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. వార్మప్‌ మ్యాచ్‌లు కూడా ముగిసాయి. ఇదిలాఉంటే ఐసీసీ వన్డే ప్రపంచ కప్(ICC worldcup Tornment) టోర్నమెంట్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్‌ బోర్డుకు(Cricket Board) మరో ఆటంకం వచ్చి పడింది. ప్రపంచకప్‌ షెడ్యూల్‌పై ఆరంభంలో అనేక విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత వేదికలపై గందరగోళం నెలకొంది. అటు పిమ్మట టిక్కెట్లలో లోపం వెలుగులోకి వచ్చింది. వీటిని అధిగమించడానికి భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు తెగ ప్రయత్నిస్తోంది. వాస్తవానికి ప్రపంచకప్ తొలి మ్యాచ్ సందర్భంగా ఆరంభ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా ఉన్న బీసీసీఐ(BCCI) ఈ సారి ఘనంగా వేడుకలు నిర్వహిస్తుందని అంతా భావించారు. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. అక్టోబర్ 4వ తేదీన ఏర్పాటు చేసిన ప్రారంభ వేడుకలను(Opening Ceremony) బీసీసీఐ రద్దు చేసింది. ఆరంభవేడుకలను బీసీసీఐ అద్భుతంగా జరపాలని బీసీసీఐ అనుకుంది. ఆశా భోంస్లే, రణవీర్ సింగ్, తమన్నా భాటియా, శ్రేయా ఘోషల్, శంకర్ మహదేవన్, అరిజిత్ సింగ్ వంటి స్టార్స్ ప్రారంభ వేడుకకు హాజరవుతారని ప్రకటించింది కూడా. ఏమైందో తెలియదు కానీ హఠాత్తుగా ఓపెనింగ్‌ సెర్మనీని రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఓపెనింగ్ సెర్మనీకి బదులుగా నవంబర్ 19న ముగింపు వేడుకను నిర్వహించాలని లేదా అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్(India-pakistan) మ్యాచ్ కంటే ముందు ఘనంగా వేడుకను నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నదట! అయితే ఆరంభ వేడుకల రద్దు విషయంపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Updated On 4 Oct 2023 4:09 AM GMT
Ehatv

Ehatv

Next Story