వెస్టిండీస్‌(West Indies) పర్యటనకు టీమిండియా టెస్టు(Team India Test), వన్డే జట్ల‌ను(One Day Team) బీసీసీఐ ప్రకటించింది. యశస్వి జైస్వాల్(Yashaswi Jaiswal), రుతురాజ్ గైక్వాడ్‌లు(Ruthuraj Gaikwads) తొలిసారి టెస్టు జట్టులోకి వచ్చారు. టెస్ట్‌ ఫార్మాట్‌లో అజింక్యా రహానే(Ajinkya Rahane) జట్టుకు వైస్ కెప్టెన్‌గా(Vice Captain) నియమితుడయ్యాడు.

వెస్టిండీస్‌(West Indies Tour) పర్యటనకు టీమిండియా టెస్టు(Team India Test), వన్డే జట్ల‌ను(One Day Team) బీసీసీఐ ప్రకటించింది. యశస్వి జైస్వాల్(Yashaswi Jaiswal), రుతురాజ్ గైక్వాడ్‌లు(Ruthuraj Gaikwads) తొలిసారి టెస్టు జట్టులోకి వచ్చారు. టెస్ట్‌ ఫార్మాట్‌లో అజింక్యా రహానే(Ajinkya Rahane) జట్టుకు వైస్ కెప్టెన్‌గా(Vice Captain) నియమితుడయ్యాడు. సంజూ శాంసన్(Sanju shamsan), ఉమ్రాన్ మాలిక్(Umran malik) లు మళ్లీ వన్డే జట్టులోకి వచ్చారు. ఐపీఎల్ 2023లో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లకు రివార్డ్ లభించింది. వీరిద్దరూ తొలిసారిగా భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రుతురాజ్ ఆటతీరు సాటిలేనిది. చెన్నై సూపర్ కింగ్స్(CSK) తరఫున ఆడుతున్న ఈ ఓపెనర్ ..16 మ్యాచ్‌ల్లో 147 స్ట్రైక్ రేట్‌తో 590 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున 14 మ్యాచ్‌ల్లో 625 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లోనూ యశస్వి బ్యాట్ తో రాణించాడు. నవదీప్ సైనీ కూడా చాలా కాలం తర్వాత టెస్టు జట్టులోకి తిరిగి వచ్చాడు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్3 చివరి మ్యాచ్‌లో బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసినందుకు అజింక్య రహానెను టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా మరోసారి నియమించారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రహానే అద్భుత ప్రదర్శన చేశాడు. ముఖేష్ కుమార్ టెస్ట్, వన్డే జట్లలో స్థానం సంపాదించుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్‌కు వ‌న్డే జట్టులో కూడా స్థానం క‌ల్పించారు సెలెక్ట‌ర్లు.

వన్డే జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (wk), ఇషాన్ కిషన్ (wk), హార్దిక్ పాండ్యా (VC), శార్దూల్ ఠాకూర్, R జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.

టెస్ట్ జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (విసి), కెఎస్ భరత్ (వికె), ఇషాన్ కిషన్ (వికె), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.

Updated On 23 Jun 2023 5:29 AM GMT
Ehatv

Ehatv

Next Story