ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్(World Test Championship) ఫైన‌ల్‌కు భారత జట్టు(India Team)ను బీసీసీఐ (BCCI)ప్రకటించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ జూన్ 7న‌ ఇంగ్లాండ్‌(England)లో జరుగుతుంది. భారత్, ఆస్ట్రేలియా(Australia) జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టును ప్రకటించగా.. తాజాగా బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్(World Test Championship) ఫైన‌ల్‌కు భారత జట్టు(India Team)ను బీసీసీఐ (BCCI)ప్రకటించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ జూన్ 7న‌ ఇంగ్లాండ్‌(England)లో జరుగుతుంది. భారత్(India), ఆస్ట్రేలియా(Australia) జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టును ప్రకటించగా.. తాజాగా బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున ఆడుతూ అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్న అజింక్యా రహానెకు బీసీసీఐ జ‌ట్టులో అవ‌కాశం క‌ల్పించింది.

బీసీసీఐ ప్రకటించిన జట్టులో అతి పెద్ద మార్పు అజింక్యా రహానేదిగా చెప్పొచ్చు. పేలవమైన ఫామ్ కారణంగా ర‌హానే జ‌ట్టులో స్థానం కోల్పోయాడు. సుమారు 17 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. అజింక్య రహానేకు మరోసారి టీమ్ ఇండియాలోకి పిలుపు వ‌చ్చింది. అజింక్య రహానే.. ఐపీఎల్-2023లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. ధోనీ ర‌హానేకు వ‌రుస అవ‌కాశాలు ఇవ్వ‌డంతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. వికెట్ కీప‌ర్‌గా ఆంధ్ర సంచ‌ల‌నం కేఎస్‌ భరత్ కు మ‌రో అవ‌కాశం క‌ల్పించారు. పేస‌ర్ జయదేవ్ ఉనద్కత్ కు కూడా జ‌ట్టులో చోటు ద‌క్కింది. మిగ‌తా టీమ్ అంతా య‌ధాత‌ధంగా కొన‌సాగించారు.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎల్‌ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఆర్‌ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.

Updated On 25 April 2023 1:27 AM GMT
Ehatv

Ehatv

Next Story