ఆసియా కప్ 2023(Asia Cup 2023) కోసం సెలక్టర్లు భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. ఊహించినట్లుగానే జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) జట్లులోకి తిరిగి వచ్చాడు. జట్టుకు రోహిత్ శర్మ(Rohith Sharma) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీమ్‌లోకి తిలక్ వర్మ(Tilak Varma) సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు. న్యూఢిల్లీలో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశం అనంతరం కెప్టెన్ రోహిత్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశంలో 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు.

Thilak Varma Entry In Asia Cup 2023

కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లు కూడా చాలా కాలం తర్వాత టీమ్ లోకి తిరిగి వచ్చారు. బుమ్రాతో సహా ఈ ఇరువురికి గాయాలయ్యాయి. ఐర్లాండ్‌తో జరుగుతున్న T20 సిరీస్ ద్వారా బుమ్రా జట్టులోకి తిరిగి వచ్చాడు. KL రాహుల్, శ్రేయాస్ అయ్యర్ మాత్రం నేరుగా ఆసియా కప్‌లో ఆడనున్నారు.
సెప్టెంబరు 2న పాకిస్థాన్‌తో(Pakistan) భారత జట్టు(TeamIndia) ప్రారంభ మ్యాచ్ ఆడనుంది. పల్లికల్‌లోని ప్రేమదాస ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. గతసారి వన్డే ఫార్మాట్‌లో భారత జట్టు గెలుపొందగా.. టీ20 ఫార్మాట్‌లో శ్రీలంక పాకిస్థాన్‌ను ఓడించి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది.
భారత మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని శివ సుందర్ దాస్, సుబ్రొతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్‌లతో కూడిన సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఎంపిక సమావేశానికి హాజరయ్యారు.
ఆసియా కప్ కోసం టీమ్ ఇండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ , మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.