రూల్స్‌లో ఉంటే ఉండొచ్చు.. కొంచెమైనా క్రీడాస్ఫూర్తి ఉండొద్దు! ఈమాత్రం స్పిరిట్ లేనప్పుడు ఆటలాడి ఏం లాభం? శ్రీలంక బ్యాట్స్‌మన్ ఏంజెలో మాథ్యూస్‌ను(Mathews) టైమ్డ్ అవుట్‌గా(Timed Out) ప్రకటించే విషయంలో క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన బంగ్లాదేశ్(Bangladesh) కెప్టెన్ షకీబ్‌ను(Shakib) క్రికెట్ ప్రపంచమంతా తిట్టిపోస్తున్నది.
రూల్స్‌లో ఉంటే ఉండొచ్చు.. కొంచెమైనా క్రీడాస్ఫూర్తి ఉండొద్దు! ఈమాత్రం స్పిరిట్ లేనప్పుడు ఆటలాడి ఏం లాభం? శ్రీలంక బ్యాట్స్‌మన్ ఏంజెలో మాథ్యూస్‌ను(Mathews) టైమ్డ్ అవుట్‌గా(Timed Out) ప్రకటించే విషయంలో క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన బంగ్లాదేశ్(Bangladesh) కెప్టెన్ షకీబ్‌ను(Shakib) క్రికెట్ ప్రపంచమంతా తిట్టిపోస్తున్నది. అయినప్పటికీ షకీబ్ మాత్రం కొంచెం కూడా పశ్చాత్తాపం చెందడం లేదు. పైగా తాను చేసింది కరెక్టేనని సమర్థించుకుంటున్నాడు. అలా జరిగినందుకు బాధలేదని నిసిగ్గుగా చెబుతున్నాడు.
మాథ్యూస్ టైమ్డ్ అవుట్ కోసం అప్పీల్ చేసినందుకు నాకు ఎలాంటి బాధలేదని నిర్మోహమాటంగా చెబుతున్నాడు. 'మా ఫీల్డర్‌లలో ఒకరు నా దగ్గరకు వచ్చి అప్పీల్ చేస్తే మాథ్యూస్ ఔట్ అవుతాడని చెప్పాడు. నేను అలాగే చేశాను. అంపైర్లు నేను సీరియస్‌గా అప్పీల్ చేస్తున్నానా లేదా అని అడిగారు. నేను సీరియస్‌గానేనని చెప్పాను. ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు. రూల్స్‌లో ఉంది కాబట్టి అప్పీల్ చేశాను' అని వివరణ ఇచ్చుకున్నాడు షకీబ్. పోరులో ఉన్నప్పుడు జట్టు ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాల్సి వస్తుందని, అందుకు తాను ఎప్పుడూ సిద్దంగా ఉంటానని షకీబ్ తెలిపాడు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనన్నాడు. పైగా మాథ్యూస్‌తో వాగ్వాదం తమ గెలుపుకు కలిసొచ్చిందని చెప్పుకొచ్చాడు.