ఐపీఎల్ 2023 60వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 112 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్ రేసులో నిలవడానికి ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకమైంది. నేటి మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశ‌ల‌ను నిలుపుకుంది. ఈ ఘోర పరాజయం తర్వాత రాజస్థాన్‌ ప్లేఆఫ్‌కు వెళ్లడం దాదాపు అసాధ్యంగా మారింది.

ఐపీఎల్ 2023 60వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌(Rajasthan Royals)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) 112 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్(Playoffs) రేసులో నిలవడానికి ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకమైంది. నేటి మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశ‌ల‌ను నిలుపుకుంది. ఈ ఘోర పరాజయం తర్వాత రాజస్థాన్‌ ప్లేఆఫ్‌కు వెళ్లడం దాదాపు అసాధ్యంగా మారింది.

172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌(Rajasthan) జట్టుకు తొలి ఓవర్‌లోనే పేలవమైన ఆరంభం లభించింది. రాజస్థాన్ స్టార్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్(Yashaswi Jaiswal), జోస్ బట్లర్(Jos Buttler) తొలి రెండు ఓవర్లలో ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టారు. అనంతరం 4 పరుగుల వద్ద కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) ఔటయ్యాడు. రాజస్థాన్ కష్టాల పరంపర ఇక్కడితో ఆగలేదు. దేవదత్ పడిక్కల్ (4), జో రూట్(Joe Root) (10), ధ్రువ్ జురెల్(Dhruv Jurel) (1), రవిచంద్రన్ అశ్విన్ (0), ఆడమ్ జంపా (2) పూర్తిగా ఫ్లాప్ అయ్యారు. దీంతో రాయ‌ల్స్ 10.3 ఓవ‌ర్ల‌లో 59 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. ఆర్‌సీబీ తరఫున వేన్ పార్నెల్ 3 వికెట్లు పడగొట్టాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ(Virat Kohli) (18) మరోసారి విఫ‌ల‌మ‌య్యాడు. ఫాఫ్‌ డు ప్లెసిస్‌(Faf Du Plessis), గ్లెన్‌ మాక్స్‌వెల్‌(Glen Maxwell) జోడీ జ‌ట్టును కష్టాల నుంచి గట్టెక్కించింది. ఫాఫ్ 43 బంతులు ఆడి 55 పరుగులు చేశాడు. మాక్స్‌వెల్‌ 33 బంతుల్లో 54 పరుగులు చేశాడు. చివర్లో అనుజ్ రావత్ వేగంగా 29 పరుగులు చేసి ఆర్సీబీ స్కోరు 170 ప‌రుగుల‌కు చేర్చాడు. రాజస్థాన్‌ తరఫున కేఎం ఆసిఫ్‌, ఆడమ్‌ జంపా రెండేసి వికెట్లు తీశారు.

Updated On 15 May 2023 5:45 AM GMT
Yagnik

Yagnik

Next Story