Mitchel Marsh : ప్రపంచకప్ ట్రోఫీపై మళ్లీ కాళ్లు పెట్టడానికి వెనుకాడను... మార్ష్
వన్డే ప్రపంచకప్ ఫైనల్లో(onre day world cup) ఆస్ట్రేలియా(Aiustralia) చేతిలో టీమిండియా(Team India) పరాజయం చవి చూసిన బాధలో ఉన్న ఇండియన్స్‌కు ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(Michel Marsh) చేసిన పని పుండు మీద కారం చల్లినట్టయ్యింది.
వన్డే ప్రపంచకప్ ఫైనల్లో(onre day world cup) ఆస్ట్రేలియా(Aiustralia) చేతిలో టీమిండియా(Team India) పరాజయం చవి చూసిన బాధలో ఉన్న ఇండియన్స్‌కు ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(Michel Marsh) చేసిన పని పుండు మీద కారం చల్లినట్టయ్యింది. ప్రపంచకప్ ట్రోఫీపై(World Cup trophy) కాళ్లు పెట్టి విశ్రాంతి తీసుకోవడాన్ని భారతీయులలో కొందరు జీర్ణించుకోలేకపోయారు. సోషల్ మీడియాలో(Social media) తెగ విమర్శలు చేశారు. కొందరైతే తిట్టిపోశారు. అక్కడికేదో పెద్ద అపరాధం జరిగిపోయినట్టు ఫీలయ్యారు. అప్పుడు రియాక్టవ్వని మార్ష్ ఇప్పుడు పెదవి విప్పాడు. ట్రోఫీపై కాళ్లు పెట్టడాన్ని సమర్థించుకున్నాడు. కప్ పట్ల తానేమీ అమర్యాదకరంగా ప్రవర్తించలేదన్నాడు. 'ఆ ఫోటోలో ఎలాంటి అగౌరమమూ లేదు. దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. సోషల్ మీడియాను ఎక్కువగా చూడను. అందులో నాకు ఎలాంటి తప్పు కనబడట్లేదు. నిజాయితీగా చెప్పాలంటే మళ్లీ అలా చేయడానికి వెనుకాడను' అని మిచెల్ మార్ష్ చెప్పాడు. మరి ఈ వ్యాఖ్యలపై మనవాళ్లు ఎలా రియాక్టవుతారో చూడాలి.