ఆస్ట్రేలియా(Austalia) ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్(Glen Maxwell) త్వరలోనే ఆయన తండ్రగా ప్రమోషన్ అందుకోబోతున్నాడు. భార్య వినీ రామన్‌తో(Vini Raman) కలిసి మే నెలలో ఈ గుడ్‌న్యూస్‌ను చెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు(RCB) ప్రాతినిధ్యం వహిస్తున్న మాక్స్‌వెల్‌ను తమిళనాడు మూలాలున్న వినీ రామన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. త్వరలోనే తమ జీవితంలో రెయిన్ బో బేబీ రాబోతున్నదంటూ సంతోషం వ్యక్తం చేశారు
ఆస్ట్రేలియా(Austalia) ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్(Glen Maxwell) త్వరలోనే ఆయన తండ్రగా ప్రమోషన్ అందుకోబోతున్నాడు. భార్య వినీ రామన్‌తో(Vini Raman) కలిసి మే నెలలో ఈ గుడ్‌న్యూస్‌ను చెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు(RCB) ప్రాతినిధ్యం వహిస్తున్న మాక్స్‌వెల్‌ను తమిళనాడు మూలాలున్న వినీ రామన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. త్వరలోనే తమ జీవితంలో రెయిన్ బో బేబీ రాబోతున్నదంటూ సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా తన సీమంతం(Baby Shower) ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రామన్. తమిళ సంప్రదాయ పద్ధతిలో జరిగిన వలైకాప్పు వేడుకకు సంబంధించిన ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు రామన్. వలైకాప్పు అంటే సీమంతం అన్నమాట! నిండైన చీరకట్టు,చేతులకు గాజులు, మెడలో నగలు, నుదుటిన కుంకుమ బొట్టుతో అచ్చంగా తమిళ అమ్మాయిలాగే ఉంది రామ్. భర్తను ఆప్యాయంగా హత్తుకున్న వినీ రామన్ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. విదేశాల్లో ఉన్నామన సంస్కృతిని, సంప్రదాయాలను మర్చిపోకుండా పుట్టబోయే బిడ్డ కోసం అందమైన వేడుక జరిపినందుకు చాలా సంతోషంగా ఉందని పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు. తమిళనాడు మూలాలున్న వినీ రామన్, ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ మాక్స్‌వెల్ పెళ్లి గత ఏడాది మార్చి18న ఆస్ట్రేలియాలో జరిగింది. ఇంతకు ముందు కూడా వినీ రామన్ గర్బవతి అయ్యారు. కాకపోతే ఆ బిడ్డ భూమ్మీదకు రాకుండానే వెళ్లిపోయింది.