ఐపీఎల్-2024(IPL 2024) ఆటగాళ్ల వేలం(Auction) ప్ర‌క్రియ‌ దుబాయ్‌లో(Dubai) జరుగుతోంది. వేలం ప్రారంభ ద‌శ‌లో రికార్డులు బ‌ద్ద‌ల‌వుతున్నాయి. ఈ సారి ఏకంగా రూ.20 కోట్లు ప‌లికాడంటే పోటీ ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. ఈ వేలంలో కమిన్స్‌ను రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో కొనుగోలు చేసేందుకు చెన్నై(Chennai)(CSK), ముంబైలు(Mumbai)(MI) ఆసక్తి చూపాయి.

ఐపీఎల్-2024(IPL 2024) ఆటగాళ్ల వేలం(Auction) ప్ర‌క్రియ‌ దుబాయ్‌లో(Dubai) జరుగుతోంది. వేలం ప్రారంభ ద‌శ‌లో రికార్డులు బ‌ద్ద‌ల‌వుతున్నాయి. ఈ సారి ఏకంగా రూ.20 కోట్లు ప‌లికాడంటే పోటీ ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. ఈ వేలంలో కమిన్స్‌ను రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో కొనుగోలు చేసేందుకు చెన్నై(Chennai)(CSK), ముంబైలు(Mumbai)(MI) ఆసక్తి చూపాయి. తర్వాత RCB, హైదరాబాద్(Hyderabad)(SRH) ఈ రేసులో చేరాయి. చివ‌ర‌కు హైదరాబాద్ కమిన్స్‌ను రూ.20.5 కోట్లకు ద‌క్కించుకుంది. ఓ ఆట‌గాడు ఐపీఎల్ చ‌రిత్ర‌లో రూ.20 కోట్ల ధ‌ర ప‌ల‌క‌డం ఇదే తొలిసారి.

రోమన్ పావెల్(Roman Powell) : కోటి రూపాయల బేస్ ధర ఉన్న రోమన్ పావెల్ కోసం కోల్‌కతా(Kolkata), రాజస్థాన్(Rajasthan) మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరకు రాజస్థాన్ జట్టు అతడిని రూ.7.4 కోట్లకు కొనుగోలు చేసింది.

ట్రావిస్ హెడ్(Travis Head): చెన్నై, హైదరాబాద్ ట్రావిస్ హెడ్‌పై రూ. 2 కోట్ల బేస్ ధరతో పందెం కాశారు. చివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.6.8 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. వరల్డ్ కప్ ఫైనల్‌లో సెంచరీ చేయడం ద్వారా హెడ్ ఆస్ట్రేలియాకు ట్రోఫీని అందించాడు.

హ్యారీ బ్రూక్(Harry Brooke): రూ.2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న బ్రూక్ కోసం ఢిల్లీ(Delhi), రాజస్థాన్ మధ్య సుదీర్ఘ పోరాటం జరిగింది, చివరకు రూ.4 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది.

కరుణ్ నాయర్(Karun Nair) : రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో ఉన్న‌ కరుణ్ నాయర్‌పై ఏ టీమ్ కూడా ఆస‌క్తి చూప‌లేదు.

స్టీవ్ స్మిత్(Stev Smith) : ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ స్మిత్‌పై ఏ జట్టు ఆస‌క్తి చూప‌లేదు. అతని బేస్ ధర రూ.2 కోట్లు.

రిలే రూసో(Riley Rousseau) : రూ. 2 కోట్ల బేస్ ధరతో ఈ ఆటగాడిపై ఏ జట్టు కూడా పందెం వేయలేదు. వేలంలో అమ్ముడుపోలేదు.

మనీష్ పాండే(Manish Pandey) : రూ. 50 లక్షల బేస్ ప్రైస్ ఉన్న మనీష్ పాండేపై కూడా ఎవ‌రూ ఆస‌క్తి చూప‌లేదు.

వనిందు హసరంగా(Vanindu Hasaranga) : శ్రీలంక స్పిన్నర్ బేస్ ధర రూ. 1.5 కోట్లు కావడంతో హైదరాబాద్ అతడిని తమ జట్టులోకి తీసుకుంది. మరే ఇతర జట్టు కూడా హసరంగపై ఆస‌క్తి చూప‌లేదు.

రచిన్ రవీంద్ర(Rachin Ravindra) : రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో ఉన్న‌ రవీంద్రను కొనుగోలు చేసేందుకు చెన్నై-ఢిల్లీ మధ్య పోటీ జరిగింది. 1.8 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది. వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ తరఫున రవీంద్ర బంతితో, బ్యాటింగ్‌తో అద్భుతాలు చేశాడు.

శార్దూల్ ఠాకూర్(Shardul Thakur) : శార్దూల్ ఠాకూర్‌ను రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో కొనుగోలు చేసేందుకు చెన్నై, హైదరాబాద్‌లు ఆసక్తి చూపాయి. చివరకు చెన్నై అతడిని రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది.

అజ్మతుల్లా ఒమర్‌జాయ్(Azmatullah Omarzai) : అఫ్ఘానిస్థాన్‌ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ రూ. 50 లక్షల బేస్‌ ధరతో కొనుగోలు చేసింది.

గెరాల్డ్ కోయెట్జీ(Gerald Coetzee) : దక్షిణాఫ్రికా బౌలర్‌ను రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో కొనుగోలు చేసేందుకు చెన్నై, ముంబై ఆసక్తి కనబరిచాయి. 5 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది.

హర్షల్ పటేల్(Harshal Patel) : రూ.2 కోట్ల బేస్ ధరతో హర్షల్ పటేల్ ను కొనుగోలు చేసేందుకు గుజరాత్, పంజాబ్ లలో పోటీ నెలకొంది. చివరకు పంజాబ్ కింగ్స్ అతడిని రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది.

డారిల్ మిచెల్(Daryl Mitchell) : రూ. కోటి ప్రాథమిక ధర కలిగిన డారిల్ మిచెల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య పోరు నెలకొంది. చివరకు చెన్నై ఈ రేసులో చేరి అతడిని 14 కోట్లకు కొనుగోలు చేసింది.

Updated On 19 Dec 2023 4:29 AM GMT
Ehatv

Ehatv

Next Story