ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌(Glenn Maxwell) తప్పతాగి ఆసుప్రతి పాలయ్యాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెట్‌ ప్లేయర్‌ బ్రెట్‌ లీ సభ్యుడిగా ఉన్న సిక్స్‌ అండ్‌ అవుట్‌ బ్యాండ్‌ జనవరి 19వ తేదీన ఆడిలైడ్‌ నగరంలో ఓ కాన్సర్ట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి లేకుండానే మాక్స్‌వెల్‌ పాల్గొన్నాడు.

ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌(Glenn Maxwell) తప్పతాగి ఆసుప్రతి పాలయ్యాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెట్‌ ప్లేయర్‌ బ్రెట్‌ లీ సభ్యుడిగా ఉన్న సిక్స్‌ అండ్‌ అవుట్‌ బ్యాండ్‌ జనవరి 19వ తేదీన ఆడిలైడ్‌ నగరంలో ఓ కాన్సర్ట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి లేకుండానే మాక్స్‌వెల్‌ పాల్గొన్నాడు. పాల్గొంటే పాల్గొన్నాడు కానీ పీకలదాకా తాగేశాడు. మత్తు తలకెక్కడంతో పబ్‌లోనే పడిపోయాడు. అతడిని రాయల్‌ అడిలైడ్‌ ఆసుప్రతికి తీసుకెళ్లారు. ఈ ఘటనను క్రికెట్ ఆస్ట్రేలియా సీరియస్‌గా తీసుకుంది. విచారణ ప్రారంభించింది. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా టీమ్‌లో మాక్స్‌వెల్‌కు చోటు దక్కలేదు. టీ-20ల కోసం మాక్స్‌వెల్‌కు విశ్రాంతినిచ్చారు. అంతే కానీ అతడిని టీమ్‌లోంచి తప్పించడానికి పబ్‌లో తప్పతాగి పడిపోవడానికి ఎలాంటి సంబంధం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌ టీమ్‌కు మాక్స్‌వెల్‌ సారథ్యం వహించాడు. జట్టును ఫైనల్‌కు చేరలేకపోవడంతో కెప్టెన్సీ పదవి వదులుకున్నాడు.

Updated On 23 Jan 2024 1:07 AM GMT
Ehatv

Ehatv

Next Story