ఆసియాకప్‌-2023లో(Asia Cup 2023) మరోసారి ఇండియా(India)-పాకిస్తాన్‌లు(pakistan) తలపడబోతున్నాయి. ఈ టోర్నమెంట్‌ సూపర్‌-4లో భాగంగా ఆదివారం దాయాదీ దేశాలు అమీతుమీ తేల్చుకోనున్నాయి. శ్రీలంకలోని(Sri lanka) కొలంబోలో(Columbia) ఈ మ్యాచ్‌ జరుగనుంది. లీగ్‌ మ్యాచ్‌ వర్షానికి తుడిచిపెట్టుకుపోవడంతో ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆసియాకప్‌-2023లో(Asia Cup 2023) మరోసారి ఇండియా(India)-పాకిస్తాన్‌లు(pakistan) తలపడబోతున్నాయి. ఈ టోర్నమెంట్‌ సూపర్‌-4లో భాగంగా ఆదివారం దాయాదీ దేశాలు అమీతుమీ తేల్చుకోనున్నాయి. శ్రీలంకలోని(Sri lanka) కొలంబోలో(Columbia) ఈ మ్యాచ్‌ జరుగనుంది. లీగ్‌ మ్యాచ్‌ వర్షానికి తుడిచిపెట్టుకుపోవడంతో ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు దేశాలు గెలుపుపై కొండంత నమ్మకంతో ఉన్నాయి. భారత్‌పై కచ్చితంగా విజయం సాధిస్తామని పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం(Babar Azam) అంటున్నాడు. 'మేము గత రెండు నెలలుగా శ్రీలంకలో క్రికెడ్‌ ఆడుతున్నాము. ఇక్కడ మొదట శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌ ఆడాం.

తర్వాత జట్టులో చాలా మంది ఆటగాళ్లు లంక ప్రీమియర్‌ లీగ్‌లో ఆడారు. అదే విధంగా ఈ టోర్నమెంట్‌ ప్రారంభానికి ముందు ఇక్కడే అఫ్గనిస్థాన్‌తో వన్డే సిరీస్‌ కూడా ఆడాం. కాబట్టి శ్రీలంక పరిస్థితులను మేము బాగా అర్థం చేసుకున్నాము. ఆ అనుభవంతో భారత్‌పై గెలుస్తామని చెబుతున్నానని బాబర్‌ ఆజం అన్నాడు. పాకిస్తాన్‌ పేస్‌ బౌలర్లు షహీన్‌ షా అఫ్రిది, హారీస్‌ రవూఫ్‌, నసీం షాలను బాబర్‌ తెగ మెచ్చుకున్నాడు. ' మా పేస్‌ బౌలర్లు బంతితో మాకు అద్భుతమైన ఆరంభాన్ని అందిస్తున్నారు. అదే విధంగా మిడిల్‌ ఓవర్లలో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసేందుకు మేము ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాము అని బాబర్‌ ఆజం తెలిపాడు.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌కు ప్రత్యేక రిజర్వ్‌ డేను జోడించారు. ఆదివారం రోజు కొలంబోలో వర్షం పడే అవకాశం ఉండటంతో ఈ మ్యాచ్‌ కోసం ప్రత్యేకంగా రిజర్వ్‌ డేను కేటాయిస్తున్నట్టు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. ఒకవేళ ఆదివారం వర్షం కురిస్తే, మ్యాచ్‌ నిలిచిపోతే, ఆట ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే సోమవారం మ్యాచ్‌ను కొనసాగిస్తారు. ఆసియా కప్‌ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు ఒక్క ఫైనల్‌ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్‌ డే(Reserve Day) ఉంది. సెప్టెంబర్‌ 17న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ప్రేమదాస స్టేడియంలో మొత్తం ఐదు సూపర్‌– 4 మ్యాచ్‌లు ఉండగా... మిగతా నాలుగు మ్యాచ్‌లకు కాకుండా ఒక్క భారత్, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌కే రిజర్వ్‌ డే ఇవ్వడం గమనార్హం. టోర్నీ ఆర్థికపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రసారకర్తల విజ్ఞప్తి మేర కు ఏసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Updated On 9 Sep 2023 6:40 AM GMT
Ehatv

Ehatv

Next Story