Asia Cup 2023 Matches in pakistan : పాకిస్తాన్‌లోనే ఆసియా కప్.. భారత్ ఆడే మ్యాచ్‌లు మాత్రం అక్కడే.!
సెప్టెంబర్(September)లో జరిగే ఆసియా కప్(Asia Cup) పాకిస్తాన్(PAkistan)లోనే జరుగుతుంది. కాకపోతే ఇండియా ఆడే మ్యాచ్(India Matches)లు మాత్రం తటస్థ వేదికల్లో జరుగుతాయి. ఈ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board), భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(Board of Control for Cricket in India)లు రాజీకొచ్చాయి.
సెప్టెంబర్(September)లో జరిగే ఆసియా కప్(Asia Cup) పాకిస్తాన్(PAkistan)లోనే జరుగుతుంది. కాకపోతే ఇండియా ఆడే మ్యాచ్(India Matches)లు మాత్రం తటస్థ వేదికల్లో జరుగుతాయి. ఈ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board), భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(Board of Control for Cricket in India)లు రాజీకొచ్చాయి. నిజానికి ఈ టోర్నమెంట్ పాకిస్తాన్‌లో జరుగుతుండటంతో అక్కడకి వెళ్లేందుకు భారత్ నిరాకరించింది. దీంతో ఆసియాకప్‌ను తటస్థ వేదికకు మార్చాలనుకుంది ఆసియా క్రికెట్ కౌన్సిల్(Asian Cricket Council). అయితే ఆసియా కప్ తమ దేశంలో నిర్వహించకపోతే ఇండియాలో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో తాము ఆడబోమని పాకిస్తాన్ తెలిపింది. పాకిస్తాన్ అల్టిమేటమ్‌ను బీసీసీఐ(BCCI) పెద్దగా పట్టించుకోలేదు. దీంతో రెండు బోర్డుల మధ్య రాజీ కుదిర్చేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రయత్నించింది. గురువారం రాత్రి ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులు సమావేశమయ్యాయి. ఆసియా కప్‌లో టీమిండియా ఆడుతుందని, టోర్నమెంట్ పాకిస్తాన్‌లోనే జరుగుతుందని ఏసీసీ తెలిపింది. అయితే ఇండియా ఆడే మ్యాచ్‌లను మాత్రం తటస్థ వేదికల్లో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. ఇండియా ఆడే మ్యాచ్‌లకు సంబంధించి ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంగ్లాండ్, శ్రీలంక పేర్లను పరిశీలించారు. వీటిల్లో ఏదో ఒకటి ఫైనలైజ్ చేస్తారు. ఒకవేళ టీమిండియా ఆసియా కప్ ఫైనల్లో చేరుకుంటే ఆ మ్యాచ్‌ను కూడా తటస్థ వేదికలోనే నిర్వహిస్తారు. ఈ ప్రతిపాదనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఓకే చెప్పింది. మొత్తంమీద బీసీసీఐ తన పంతం నెగ్గించుకుంటే పీసీబీ మాత్రం ఓ మెట్టు దిగాల్సి వచ్చింది. ఆసియా కప్‌లో ఆరు దేశాలు పాల్గొంటున్నాయి. ఇండియా, పాకిస్తాన్, క్వాలిఫయర్‌లు ఒక గ్రూపులో ఉన్నాయి. మరో గ్రూపులో శ్రీలంక(Sri Lanka), బంగ్లాదేశ్(Bangladesh), అఫ్గనిస్తాన్(Afghanistan)
లు ఉన్నాయి. 13 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్‌లో గ్రూపు దశలో తొలి రెండు స్థానాలలో నిలిచిన జట్లు సూపర్ ఫోర్‌కు క్వాలిఫై అయితాయి. సూపర్-4లో మొదటి రెండు స్థానాలలో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి.