టోర్నమెంట్‌కు ఆతిథ్యమిచ్చే దేశానికే అందులో పాల్గొనే అవకాశం రాకపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు పాకిస్తాన్‌కు(pakistan) అదే జరుగుతోంది. రాబోయే ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో(Asia Cup Cricket Tournaments) పాకిస్తాన్ ఆడేది అనుమానమే! పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో ఆడేందుకు భారత్ బెట్టు(Team India) చూపించింది.
టోర్నమెంట్‌కు ఆతిథ్యమిచ్చే దేశానికే అందులో పాల్గొనే అవకాశం రాకపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు పాకిస్తాన్‌కు(pakistan) అదే జరుగుతోంది. రాబోయే ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో(Asia Cup Cricket Tournaments) పాకిస్తాన్ ఆడేది అనుమానమే! పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో ఆడేందుకు భారత్ బెట్టు(Team India) చూపించింది. అలాగైతే హైబ్రిడ్ మోడ్‌లో టోర్నీని నిర్వహించడం బెటరని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సూచించింది. హైబ్రిడ్ మోడ్ ప్రకారం పాక్‌లో కొన్ని మ్యాచ్‌లు, భారత్ ఆడే మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించాన్నది పాక్ ప్రతిపాదన. దీనికి బీసీసీఐ(BCCI) ఒప్పుకోలేదు. సెప్టెంబర్ మాసంలో దుబాయ్‌లో వేడి ఎక్కువగా ఉంటుందని, ఆటగాళ్లు ఆ వేడిని తట్టుకోలేరని ఏసీసీకి(ACC) బీసీసీఐ(BCCI) వివరించింది.
షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఏసీసీలో సభ్యత్వం ఉన్న ఇతర దేశాలు కూడా పాకిస్తాన్ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడ్‌ను కాదన్నాయి. దీంతో పాకిస్తాన్ లేకుండానే ఆసియా కప్ జరిగే అవకాశాలున్నాయి. టోర్నమెంట్‌కు అధికారిక హోస్ట్ అయిన పాక్ తప్ప మిగతా ఏసీసీ సభ్యులంతా ఆసియా కప్ ఆడేందుకు ఒప్పుకున్నారు. పాక్‌లో కాకుండా ఇంకో దేశంలో ఆసియాకప్ నిర్వహించడానికి కూడా అంగీకరించారు. పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ హైబ్రిడ్ మోడల్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది. పాక్ కనుక తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే మాత్రం ఈసారి పాక్ టీమ్ లేకుండానే ఆసియాకప్ జరగనుంది. పాక్ పాల్గొనకపోతే ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్, నేపాల్‌లు టోర్నీలో పాల్గొంటాయి. టోర్నీకి శ్రీలంక ఆతిథ్యమివ్వడానికి రెడీగా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ హైబ్రిడ్ మోడల్‌ను ఇండియా రిజెక్ట్ చేస్తే మాత్రం అక్టోబర్, నవంబర్ మాసాలలో ఇండియాలో జరిగే వన్డే ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ వైదొలిగే అవకాశం ఉంది. కాకపోతే ఇది పాక్‌కే నష్టం .