పాకిస్తాన్‌(Pakistan)లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడేది లేదని చెబుతూ వస్తున్న భారత్‌(India) తన పంతం నెగ్గించుకుంది. ఆసియాకప్‌-2023(Asia Cup 2023) వేదిక మారబోతున్నది. పాకిస్తాన్ నుంచి మరో దేశానికి వేదికను తరలించే అంశంపై ఆసియా క్రికెట్‌ మండలి ఆలోచిస్తోంది. లాస్టియర్‌ ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్‌ ఈసారి ఈ టోర్నమెంట్‌ను నిర్వహించడానికి హక్కులు సంపాదించింది. కాకపోతే పాకిస్తాన్‌లో ఆడేందుకు ఇండియా తిరస్కరించింది. భ

పాకిస్తాన్‌(Pakistan)లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడేది లేదని చెబుతూ వస్తున్న భారత్‌(India) తన పంతం నెగ్గించుకుంది. ఆసియాకప్‌-2023(Asia Cup 2023) వేదిక మారబోతున్నది. పాకిస్తాన్ నుంచి మరో దేశానికి వేదికను తరలించే అంశంపై ఆసియా క్రికెట్‌ మండలి ఆలోచిస్తోంది. లాస్టియర్‌ ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్‌ ఈసారి ఈ టోర్నమెంట్‌ను నిర్వహించడానికి హక్కులు సంపాదించింది. కాకపోతే పాకిస్తాన్‌లో ఆడేందుకు ఇండియా తిరస్కరించింది. భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను పాకిస్తాన్‌కు పంపించలేమని బీసీసీఐ స్పష్టం చేసింది. అలా అయితే భారత్‌ ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించడానికి తమకు అభ్యంతరం లేదని పాకిస్తాన్‌ తెలిపింది. కానీ భారత క్రికెట్‌ బోర్డు ఈ ప్రతిపాదనను కూడా కాదంది. ఈ క్రమంలో ఆసియాకప్‌-2023 నిర్వహణ వేదికను పాకిస్తాన్‌ నుంచి శ్రీలంకకు తరలించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జూన్‌లో జరిగే సమావేశంలో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ తుది నిర్ణయం తీసుకుంటుంది.
ఈసారి వన్డే ఫార్మాట్లో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు.

Updated On 9 May 2023 5:11 AM GMT
Ehatv

Ehatv

Next Story