తెలుగు కుర్రాడు ఆరవెల్లి అవనీవ్‎రావుకు(Ashwin Rao) ఐపీఎల్‎లో(IPL) ఆడే అవకాశం దక్కింది. తాజాగా ఐపీఎల్‌ 2024(IPL 2024) కోసం నిర్వహించిన వేలంలో(Auction) సీఎస్​కే(CSK) జట్టులోకి తీసుకుంది. 18 ఏళ్ల వికెట్ కీపర్(Wicket Keeper), బ్యాటర్​ అవనీశ్‌రావును ఆక్షన్ ఆఖరులో బేస్ ప్రైజ్ 20 లక్షల రూపాయలకు ఇతడిని కొనుగోలు చేసింది.

తెలుగు కుర్రాడు ఆరవెల్లి అవనీవ్‎రావుకు(Ashwin Rao) ఐపీఎల్‎లో(IPL) ఆడే అవకాశం దక్కింది. తాజాగా ఐపీఎల్‌ 2024(IPL 2024) కోసం నిర్వహించిన వేలంలో(Auction) సీఎస్​కే(CSK) జట్టులోకి తీసుకుంది. 18 ఏళ్ల వికెట్ కీపర్(Wicket Keeper), బ్యాటర్​ అవనీశ్‌రావును ఆక్షన్ ఆఖరులో బేస్ ప్రైజ్ 20 లక్షల రూపాయలకు ఇతడిని కొనుగోలు చేసింది. ఈసారి 11 మంది తెలుగు ఆటగాళ్లు వేలం బరిలో నిలవగా..కేఎస్ భరత్, అవనీశ్‎రావు మాత్రమే అమ్ముడుపోయారు.

ఇటీవల అండర్‌ -19 వన్డే ప్రపంచ కప్‌ జట్టుకు ఎంపికైన తెలంగాణ(Ashwin Rao) ముద్దుబిడ్డ అవనీశ్‌రావుకు ఐపీఎల్ రూపంలో మరో అదృష్టం వరించింది. అందరూ ఊహించినదానికంటే..ఈసారి చాలా ఇంట్రెస్టింగ్‎గా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆక్షన్‎లో సిరిసిల్లకు చెందిన యువకుడు అవనీశ్‌రావుకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఛాన్స్ ఇచ్చింది. 20 లక్షల బేస్‌ప్రైస్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌ అతడిని సొంతం చేసుకుంది. 2024 జనవరి 19 నుంచి దక్షిణాఫికా వేదికగా జరిగే అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో రాణిస్తే.. సీఎస్‌కే తుది జట్టులో ఆడే అవకాశం ఉంది.

అనూహ్యాంగా ఐపీఎల్‎లో ఆడే అవకాశం దక్కించుకున్న 18 ఏళ్ల అవనీశ్‌రావు కుటుంబ నేపథ్యం రాజన్న సిరిసిల్ల(Sircilla) జిల్లాతో ముడిపడి ఉంది. నాన్న లక్ష్మణరావు స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం పోత్గల్‌. అమ్మ సుష్మ వాళ్లది కోనరావుపేట మండలం కొలనూరు. వికెట్‌ కీపర్‌, ఎడమచేతి వాటం బ్యాటర్‌గా ఉన్న ఈ కుర్రాడు..హెచ్‌ఎంవీలో(HMV) తొలి కోచ్‌ చందు నేతృత్వంలో క్రికెట్‎లో ఓనమాలు దిద్దాడు.హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నుంచి హైదరాబాద్‌ జట్టు తరఫున అండర్‌-14, అండర్‌-16లో ఆడాడు. అండర్-19 హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న అవనీశ్‌రావు..ఇటీవల అండర్‌ -19 వన్డే ప్రపంచ కప్‌ జట్టుకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఇండియా-ఏ టీం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అవనీశ్‎రావుకు ఇండియా ఫీల్డ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.

Updated On 20 Dec 2023 7:52 AM GMT
Ehatv

Ehatv

Next Story