ప్రస్తుతం భారత ఆటగాళ్లందరూ ఐపీఎల్ 2023లో ఆడుతున్నారు. ఐపీఎల్(IPL) తర్వాత భారత క్రికెట్ జట్టు(Team India) జూన్ 7 నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(World Test Championship) ఫైనల్లో ఆస్ట్రేలియా(Australia)తో తలపడనుంది. దీని తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది.

Appointment of new Chief Selector after World Test Champions Final
ప్రస్తుతం భారత ఆటగాళ్లందరూ ఐపీఎల్ 2023లో ఆడుతున్నారు. ఐపీఎల్(IPL) తర్వాత భారత క్రికెట్ జట్టు(Team India) జూన్ 7 నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(World Test Championship) ఫైనల్లో ఆస్ట్రేలియా(Australia)తో తలపడనుంది. దీని తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో భారత చీఫ్ సెలక్టర్ నియామకానికి సంబంధించి ఓ పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చింది. పిటిఐ నివేదిక ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు చీఫ్ సెలక్టర్ నియామకం జరుగుతుందని బీసీసీఐ(BCCI) ఆశాభావం వ్యక్తం చేసింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి భారత్, ఆస్ట్రేలియాతో జరగనుంది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్ ఆడనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చేతన్ శర్మ(Chetan Sharma) రాజీనామా చేయడంతో చీఫ్ సెలక్టర్ పదవి ఖాళీగా ఉంది. భారత చీఫ్ సెలెక్టర్ చేతన్‌తో ముడిపడి ఉన్న ఒక ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ తెరపైకి వచ్చింది. అందులో అతను విరాట్ కోహ్లీ(Virat Kohli), సౌరవ్ గంగూలీ(Saurav Ganguly) వివాదంపై కూడా మాట్లాడాడు. ఇది కాకుండా ఇతర విషయాలను కూడా వెల్లడించాడు. స్టింగ్ ఆపరేషన్ తెరపైకి రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
ఈ ఏడాది చివర్లో అక్టోబరు-నవంబర్‌లో జరిగే వన్డే ప్రపంచ కప్(World Cup)కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. 1983లో కపిల్ దేవ్(Kapil Dev) సారథ్యంలో భారత్ వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) 2011 సంవత్సరంలో సిక్సర్ కొట్టి భారతదేశానికి ప్రపంచ కప్ అందించాడు. అనంతరం టీమ్ ఇండియా ట్రోఫీని గెలవలేకపోయింది.
