ఓ రాజకీయ నాయకుడి కుమారుడైన ఆటగాడితో గొడవ పడినందుకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌(andhra Cricket Association) పెద్దలు తనపై వేటు వేశారంటూ ఆంధ్రా క్రికెటర్‌ హనుమ విహారి(Hanuma Vihari) ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ స్పందించింది. క్రికెట్‌లో రాజకీయపార్టీల(Political) జోక్యం అసలు ఉండదని, గతంలో హనుమ విహారిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసింది. విహారి ఆరోపణలు విచారకరమని వ్యాఖ్యానించింది.

ఓ రాజకీయ నాయకుడి కుమారుడైన ఆటగాడితో గొడవ పడినందుకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌(andhra Cricket Association) పెద్దలు తనపై వేటు వేశారంటూ ఆంధ్రా క్రికెటర్‌ హనుమ విహారి(Hanuma Vihari) ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ స్పందించింది. క్రికెట్‌లో రాజకీయపార్టీల(Political) జోక్యం అసలు ఉండదని, గతంలో హనుమ విహారిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసింది. విహారి ఆరోపణలు విచారకరమని వ్యాఖ్యానించింది. నిజానికి హనుమ విహారి మొదట్నుంచి వివాదాస్పుడే! ఈ విషయం తెలుసుకోకుండాహనుమ విహారి ఎపిసోడ్‌ను రాజకీయలబ్ధి కోసం వాడుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌, జనసేన అధినే పవన్‌ కల్యాణ్‌ చూశారు.

విషయం తెలిసి కూడా ఓ పత్రిక విష ప్రచారం చేసింది. క్రీడలకు రాజకీయాలు పులిమింది. క్రికెటర్ హనుమ విహారి విషయంలో టీడీపీ(TDP) అనుకూల మీడియా లేనిపోని కథనాలను వండివార్చి ఆ బురదను వైసీపీకి(YCP) అంటగట్టాలని చూసింది. కానీ నిజాలు వేరు. హనుమ విహారి ఆంధ్రా క్రికెట్ కెప్టెన్ గా ఉన్నప్పటికి ఆది నుండి వివాదస్పదంగానే ఉంది.సాటి క్రీడాకారుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, పరుషంగా దూషించడం వంటి ఎన్నో ఫిర్యాదులు విహారిపై ఉన్నాయి.దీనిపై క్రీడాకారులు చేసిన ఫిర్యాదులను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ విచారణ చేసింది. ఆరోపణలు వాస్తవం అని తేలడంతో అతనికి రాతపూర్వకంగా నోటీసులిచ్చింది.దానికి హనుమ కూడా సమాధానం చెప్పాడు.

బోర్డు తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడే ఉంటానని సమాధానం చెప్పాడు. దానికనుగుణంగా అతనిపై బోర్డు చర్యలు తీసుకుంది. దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉందని, విహారిని కెప్టెన్ గా తొలగించడంలో వైసీపీ ప్రమేయం ఉందని కొన్ని పత్రికలు విషపు కథనాలు ప్రచురించాయి. అసత్య ప్రచారం చేశాయి. ఇపుడు వాస్తవాలను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తెలియజేయడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. విహారిపై గతంలో పలు ఆరోపణలు వచ్చాయని, క్షమాపణ కోరుతూ చేసిన మెయిల్స్‌ కూడా ఉన్నాయని, తనపై ఎలాంటి చర్య తీసుకున్నా పర్లేదంటూ విహారి మెయిల్స్‌ పంపారని ఏసీఏ తెలిపింది. ఈ ఏడాది జనవరిలో బెంగాల్‌తో ఆడిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు కెప్టెన్ గా ఉన్న హనుమ విహారి…. పృథ్విరాజ్‌ను కాదని గాయపడిన ఇంకొక వికెట్ కీపర్‌ను ఆడించారని ఏసీఏ తెలిపింది.

బెంగాల్‌తో రంజీ మ్యాచ్‌ సందర్భంగా విహారి వ్యక్తిగతంగా ఆ ఆటగాడిని అందరి ముందు దూషించారంటూ కంప్లయింట్‌ కూడా వచ్చిందని తెలిపింది. బాధిత ఆటగాడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశాడని తెలిపింది. విహారి గతంలో ముస్తాక్ అలీ టోర్నీ సందర్భంగా అసభ్య పదజాలం వాడటం, తోటి ఆటగాళ్ల పట్ల అనుచింతంగా ప్రవర్తించడంపై ఆంధ్రా జట్టు మేనేజర్ అసోసియేషన్‌కు ఫిర్యాదుచేశారని, విహారి వ్యవహారశైలి కారణంగా జట్టులో వర్గ విభేదాలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదులో ఉందని తెలిపింది. ముస్తాక్‌ అలీ టోర్నమెంట్‌ సందర్భంగా అసభ్య పదజాలం వాడటం, తోటి ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడం పట్ల ఆంధ్రా జట్టు మేనేజర్‌ అసోసియేషన్‌కు ఫిర్యాదు కూడా చేశారు. హనుమ విహారి వ్యవహారశైలి కారణంగా జట్టులో వర్గ విభేదాలు పెరిగిపోయాయని అందులో తెలిపారు. హనుమ విహారి తీరుపై ఫిర్యాదులు రావడంతో జనవరి 2024లో , ఫస్ట్ రంజీ ట్రోఫీ మ్యాచ్‌ తర్వాత ఏసీఏ సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ వాసిరెడ్డి చంద్రమౌళి ప్రసాద్‌ చౌదరి కొత్త కెప్టెన్‌ను ప్రతిపాదిస్తూ ఏసీఏకు ఓ మెయిల్‌ పంపారు. దీనికి విహారి స్పందిస్తూ సెలక్షన్‌ కమిటీ తీసుకున్న నిర్ణయానికి వంద శాతం కట్టుబడి ఉంటానని మెయిల్‌కు రిప్లై ఇచ్చాడు. ఈ వ్యవహారంలో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఏ మాత్రం జోక్యం చేసుకోలేదు. నిర్ణయాధికారాన్ని పూర్తిగా సెలెక్షన్‌ కమిటీయే తీసుకుంది.

Updated On 28 Feb 2024 2:38 AM GMT
Ehatv

Ehatv

Next Story