టీ-20 ప్రపంచకప్(T20 World Cup)లో పాకిస్తాన్(Pakistan)ను అమెరికా(America) ఓడించిన సంగతి తెలుసుగా! అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్తగా వచ్చిన అమెరికా టీమ్ పాకిస్తాన్‌ను ఓడిస్తుందని ఎవరూ అనుకోలేదు. క్రికెట్‌లో ఇలాంటి సంచలనాలు అప్పుడప్పుడు నమోదవుతుంటాయనుకోండి. రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. సూపర్ ఓవర్(Super over) వరకు మ్యాచ్ వెళ్లింది.
టీ-20 ప్రపంచకప్(T20 World Cup)లో పాకిస్తాన్(Pakistan)ను అమెరికా(America) ఓడించిన సంగతి తెలుసుగా! అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్తగా వచ్చిన అమెరికా టీమ్ పాకిస్తాన్‌ను ఓడిస్తుందని ఎవరూ అనుకోలేదు. క్రికెట్‌లో ఇలాంటి సంచలనాలు అప్పుడప్పుడు నమోదవుతుంటాయనుకోండి. రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. సూపర్ ఓవర్(Super over) వరకు మ్యాచ్ వెళ్లింది. అక్కడ పాకిస్తాన్‌ను అమెరికా చిత్తు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. తర్వాత 160 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ కు దిగిన అమెరికా మూడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేసింది. ఈ టార్గెట్‌ను ఛేదించడానికి బరిలోకి దిగిన పాకిస్తాన్ ఒక వికెట్ కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసింది. పాకిస్తాన్ సూపర్ ఓవర్ వేసిన పేసర్ మహ్మద్ అమీర్(Pacer Mohammad Amir) ఎక్స్‌ట్రాస్ రూపంలో ఏకంగా ఏడు పరుగులివ్వడంతోనే పాక్ ఓటమికి బాటలు పడ్డాయి. అమెరికా తరపున సూపర్ ఓవర్ బౌలింగ్ చేసిన సౌరభ్ నేత్రావల్కర్(Saurabh Netravalkar) మాత్రం 13 పరుగులు మాత్రమే ఇచ్చి గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
పాకిస్తాన్ ఓడిపోయిదంటే అందుకు కారణం మనవాళ్లే. అంటే మన భారత సంతతికి చెందిన వారన్నమాట! అమెరికా టీమ్‌కు సారథ్యం వహిస్తున్న మోనాంక్ పటేల్(Monank Patel)తో పాటు సౌరభ్ నేత్రావల్కర్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్ వంటి వారు భారతీయ మూలాలు ఉన్నవారే! మోనాంక్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి అర్థ సెంచరీ సాధించాడు. మీడియం పేసర్ నేత్రావల్కర్ 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు. మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్ టీమ్‌లోనే ఉన్నా ఫైనల్ లెవన్‌లో చోటు దక్కలేదు. ముంబాయి(Mumbai)లో జన్మించిన 32 ఏళ్ల సౌరభ్ నేత్రావల్కర్ 2010 అండర్-19 ప్రపంచకప్‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్‌తో కలిసి ఆడాడు. దేశవాళి క్రికెట్‌లో ముంబాయి తరఫున ఆడాడు. క్రికెట్‌లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కెరీర్‌పై దృష్టి పెట్టాడు. 2013లో ముంబాయి యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.. తర్వాత మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అమెరికా వెళ్లాడు. 2016లో కార్నెల్ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డ్రిగీ అందుకున్నాడు. అటు పిమ్మట ఒరాకిల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టాడు. కానీ క్రికెట్‌పై ఉన్న సహజసిద్ధమైన ఆసక్తిని వదులుకోలేదు నేత్రావల్కర్. ఉద్యోగం చేస్తూనే గల్ఫ్ జెయింట్స్, సీపీఎల్‌లో గయానా అమెజాన్ వారియర్స్ తరపున ఆడాడు. అమెరికా దేశీవాళీ క్రికెట్‌లో అద్బుతంగా రాణిస్తుండండంతో సీనియర్ జట్టులో చోటు దక్కింది. ఇక 31 ఏళ్ల మోనాంక్ పటేల్ విషయానికి వస్తే ఈయన గుజరాత్‌లోని ఆనంద్‌లో జన్మించాడు. గుజరాత్ అండర్-19 జట్టుకు కూడా పటేల్ ప్రాతినిథ్యం వహించాడు. తర్వాత అమెరికాకు వెళ్లాడు. ఆ దేశం తరపున ప్రొఫిషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. అతడు తొలిసారి టీ20 వరల్డ్‌కప్ అమెరికా క్వాలిఫైయర్స్ కోసం జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. క్వాలిఫైయర్స్ ఒమన్‌తో జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో మోనాంక్ అద్భుతమైన సెంచరీని సాధించాడు. అక్కడ నుంచి పటేల్ వెనక్కి తిరిగి చూడలేదు. అమెరికా క్రికెట్ టీమ్‌కు నాయకత్వం వహించే స్థాయికి మోనాంక్ పటేల్ చేరుకున్నాడు.