జరుగుతుందో లేదో అన్న సందిగ్ధం తొలగింది. ఆసియా కప్(Asian Cup) జరుగుతుందని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్(Asian Cricket Council) ప్రకటించింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్‌కు రెండు దేశాలు ఆతిథ్యమిస్తున్నాయి. భారత్(India), పాకిస్థాన్(Pakisthan), శ్రీలంక(Sri Lanka), బంగ్లాదేశ్(Bangladesh), అఫ్గనిస్థాన్(Afghanistan), నేపాల్‌లు(Nepal) పాల్గొంటున్న ఈ టోర్నీ 18 రోజుల పాటు జరుగనుంది.
జరుగుతుందో లేదో అన్న సందిగ్ధం తొలగింది. ఆసియా కప్(Asian Cup) జరుగుతుందని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్(Asian Cricket Council) ప్రకటించింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్‌కు రెండు దేశాలు ఆతిథ్యమిస్తున్నాయి. భారత్(India), పాకిస్థాన్(Pakisthan), శ్రీలంక(Sri Lanka), బంగ్లాదేశ్(Bangladesh), అఫ్గనిస్థాన్(Afghanistan), నేపాల్‌లు(Nepal) పాల్గొంటున్న ఈ టోర్నీ 18 రోజుల పాటు జరుగనుంది. వన్డే ఫార్మాట్‌లో(One Day Format) జరిగే ఈ ఆసియా కప్‌లో మొత్తం 13 మ్యాచ్‌లు ఉంటాయి.
హైబ్రిడ్ మోడల్‌లో(Hybrid Model) ఈ టోర్నమెంట్ జరుగుతుందని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ తెలిపింది. అంటే పాకిస్థాన్‌లో(pakisthan) నాలుగు మ్యాచ్‌లు, శ్రీలంకలో(sri lanka) తొమ్మిది మ్యాచ్‌లు జరుగుతాయి. పదిహేనేళ్ల తర్వాత ఆసియాకప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చే ఛాన్స్ పాకిస్థాన్‌కు వచ్చింది. పాకిస్థాన్-భారత్ మధ్య(India-Pakisthan) మ్యాచ్ మాత్రం శ్రీలంకలో జరుగుతుంది. టోర్నీ నిర్వహణపై బీసీసీఐ(BCCI), పీసీబీ(PCB) మధ్య తీవ్ర వాగ్వాదం సాగింది. అసలు ఆసియా కప్ జరుగుతుందా అన్న అనుమానం కలిగింది.
పాకిస్థాన్‌లో తమ జట్టును పంపబోమని బీసీసీఐ(BCCI) చెప్పడం, అలాగైతే భారత్‌లో జరిగే ప్రపంచకప్‌లో తాము ఆడబోమని పీసీబీ(PCB) బదులివ్వడం జరిగాయి. ఈ క్రమంలో పాక్ ఓ ప్రతిపాదన చేసింది. తమ దేశంలో కొన్ని మ్యాచ్‌లు, తటస్థ వేదికల్లో కొన్ని మ్యాచ్‌లు నిర్వహించేలా హైబ్రిడ్ మోడల్‌ను ముందుకు తెచ్చింది. ఈ ప్రతిపాదనకు భారత్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్‌లు ఒప్పుకోలేదు. ఇలా మంకుపట్టు పడితే తాము ప్రపంచకప్‌లో ఆడబోమని పాక్ చెప్పింది.
పాక్- భారత్ మ్యాచ్ లేకుంటే ప్రపంచకప్‌లో మజా ఉండదు కదా! అందుకే ఐసీసీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎలాంటి షరతులు లేకుండా పాక్‌ను ఒప్పించగలిగింది. అదే సమయంలో పాక్ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌ను ఏసీసీ కూడా అంగీకరించింది. దాంతో ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది. ఆసియాకప్‌లో భారత్ ఆడే మ్యాచ్‌లతో పాటు సూపర్ ఫోర్ మ్యాచ్‌లు కూడా శ్రీలంకలోనే జరుగుతాయి. వేదికలు ఇంకా ఖరారు కాలేదు. లాస్టియర్ టీ-20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియాకప్‌ను శ్రీలంక గెల్చుకుంది.