ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం అత్యుత్తమ ఆటగాడు ఎవరని అడగాల్సిన పనిలేదు. పిల్లోడిని అడిగినా విరాట్ కోహ్లీ పేరే చెబుతాడు. ఇప్పుడు వర్డ్ క్రికెట్‌ను కోహ్లీ శాసిస్తున్నాడనడంలో సందేహమే అక్కర్లేదు. బ్యాటింగ్ అయినా, ఫీల్డింగ్ అయినా కోహ్లీనే టాప్! నాయకత్వ లక్షణాలు కూడా కోహ్లీకే ఎక్కువ. ఇప్పుడు విరాట్ కోహ్లీ (Virat Kohli)తో పోల్చదగిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ (Babar Azam) మాత్రమే!
ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం అత్యుత్తమ ఆటగాడు ఎవరని అడగాల్సిన పనిలేదు. పిల్లోడిని అడిగినా విరాట్ కోహ్లీ పేరే చెబుతాడు. ఇప్పుడు వర్డ్ క్రికెట్‌ను కోహ్లీ శాసిస్తున్నాడనడంలో సందేహమే అక్కర్లేదు. బ్యాటింగ్ అయినా, ఫీల్డింగ్ అయినా కోహ్లీనే టాప్! నాయకత్వ లక్షణాలు కూడా కోహ్లీకే ఎక్కువ. ఇప్పుడు విరాట్ కోహ్లీ (Virat Kohli)తో పోల్చదగిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ (Babar Azam) మాత్రమే! బాబార్ కంటే కోహ్లీ చాలా సీనియర్.. కోహ్లీ కంటే బాబర్ ఆడిన మ్యాచ్‌లు తక్కేవే. కోహ్లీ చాలా కాలం పాటు తిరుగులేని ఫామ్‌తో ప్రపంచ క్రికెట్‌ను శాసించాడు. రెండేళ్ల పాటు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడినప్పటికీ ఇప్పుడు మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.
ఫామ్ తాత్కాలికం, క్లాస్ శాశ్వతం అన్న నానుడిని నిజం చేశాడు. అయితే నిలకడగా ఆడటం, ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటం వంటి క్వాలిటీల విషయానికి వస్తే కోహ్లీతో బాబార్‌ను పోల్చవచ్చు. ఈ విషయంలో ఇద్దరూ ఇద్దరే! అయితే ఇద్దరిలో ఎవరు గొప్ప? అన్నదానిపై మాత్రం ఒక్కొక్కరు ఒక్కోరీతిలో చెబుతారు. తాజాగా పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుర్ రజాక్(Abdur Razzaq) కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు. విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడనడంలో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. సారథిగా జట్టుకు అద్భుతమైన విజయాలను అందించాడు. ఎల్లప్పుడూ పాజిటివ్ దృక్పథంతో ఉంటాడు. వీటికి తోడు విరాట్‌లో ఫిట్‌నెస్ లెవల్స్ చాలా ఎక్కువ. ప్రపంచస్థాయి ఫిట్‌నెస్ కోహ్లీ సొంతం. ఈ విషయంలో విరాట్ తో పోలిస్తే బాబర్ చాలా వెనుకబడి ఉన్నాడు. బాబర్ ఫిట్‌నెస్ పూర్‌గా ఉంటుంది. పాకిస్తాన్ నంబర్‌వన్ ఆటగాడు బాబర్ అజామ్. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో టాప్ ప్లేయర్. ఫార్మాట్ ఏదైనా నిలకడగా ఆడతాడు. అంత మాత్రానా విరాట్‌తో బాబర్‌ను పోల్చాల్సిన అవసరం లేదు. కపిల్‌దేవ్, ఇమ్రాన్‌ఖాన్‌లలో ఎవరు గొప్ప అంటే ఏం చెబుతాం? అలాగే ఇది కూడా! విరాట్ కోహ్లీ ఇండియాలో నంబర్‌వన్ ఆటగాడు. బాబర్ పాకిస్తాన్‌కు చెందిన టాప్ ప్లేయర్. ఇద్దరూ ఇద్దరే! కానీ ఫిట్‌నెస్ విషయానికి వచ్చేసరికి కోహ్లీ చాలా ముందున్నాడు. కోహ్లీ, బాబర్‌లతో ఇదే తేడా అని అబ్దుర్ రజాక్ అన్నాడు.