క్రికెట్(cricket) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్‌ -2023(World Cup 2023) షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఈ మెగా టోర్నీకి ఇండియా ఆతిథ్యమిస్తోంది. అక్టోబర్‌ 5వ తేదీ నుంచి నవంబర్‌ 19వ తేదీ వరకు జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లు అహ్మదబాద్‌ స్టేడియంలో జరుగుతాయి.

క్రికెట్(cricket) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్‌ -2023(World Cup 2023) షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఈ మెగా టోర్నీకి ఇండియా ఆతిథ్యమిస్తోంది. అక్టోబర్‌ 5వ తేదీ నుంచి నవంబర్‌ 19వ తేదీ వరకు జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లు అహ్మదబాద్‌ స్టేడియంలో జరుగుతాయి. టోర్నీ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియణ్‌ ఇంగ్లాండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌లు పోటీ పడతాయి. ఇక ఈ క్రికెట్ టోర్నమెంట్‌లోని మూడు మ్యాచ్‌లకు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం(Uppal stadium) వేదికగా నిలవబోతోంది. ఇందులో రెండు మ్యాచ్‌లు పాకిస్తాన్‌వే(Pakisthan) కావడం విశేషం. అక్టోబర్‌ 6వ తేదీ శుక్రవారం పాకిస్తాన్‌తో క్వాలిఫయర్‌-1 పోటీపడుతుంద. అక్టోబర్‌ 9వ తేదీ సోమవారం న్యూజిలాండ్‌తో క్వాలిఫయర్‌-1 తలపడుతుంది. అక్టోబర్‌ 12వ తేదీ గురువారం పాకిస్తాన్‌ను క్వాలిఫయర్‌-2 ఎదుర్కొంటోంది. హైదరాబాద్‌లో పాకిస్తాన్‌ ఆడబోయే రెండు మ్యాచ్‌లలో శ్రీలంక, జింబాబ్వే ప్రత్యర్థులుగా ఉండే అవకాశం ఉంది.

Updated On 27 Jun 2023 4:21 AM GMT
Ehatv

Ehatv

Next Story