128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో మరోసారి క్రికెట్ ఎంట్రీ ఇవ్వ‌నుంది. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028లో క్రికెట్‌ను చేర్చనున్న‌ట్లు IOC ధృవీకరించింది. 1900లో పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను మొదటిసారి ప్ర‌వేశ‌పెట్టారు.

128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌(Olympics)లో మరోసారి క్రికెట్(Cricket) ఎంట్రీ ఇవ్వ‌నుంది. లాస్ ఏంజిల్స్(Los Angeles) ఒలింపిక్స్ 2028లో క్రికెట్‌ను చేర్చనున్న‌ట్లు IOC ధృవీకరించింది. 1900లో పారిస్‌(Paris)లో జరిగిన ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను మొదటిసారి ప్ర‌వేశ‌పెట్టారు. అప్పుడు గ్రేట్ బ్రిటన్(Great Britain), ఫ్రాన్స్(France), నెదర్లాండ్స్(Nedarlands), బెల్జియం(Belgium) జ‌ట్లు త‌ల‌ప‌డాల్సివుండ‌గా.. నెదర్లాండ్స్, బెల్జియం మ్యాచ్ ప్రారంభానికి ముందే తమ పేర్లను ఉపసంహరించుకున్నాయి. దీంతో బ్రిటన్, ఫ్రాన్స్ జట్ల మధ్య బంగారు పతకం కోసం టైటిల్ పోరు జరిగింది.

1900 ఆగస్టు 20న గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య ఒలింపిక్స్‌లో క్రికెట్ ఫైనల్ మ్యాచ్(Final Match) జరిగింది. టెస్ట్ మ్యాచ్‌లు ఐదు రోజుల పాటు జరిగేవి. కానీ ఒలింపిక్స్‌లో జ‌రిగిన‌ ఈ మ్యాచ్ కేవలం రెండు రోజులు మాత్రమే కొనసాగింది. రెండు జట్లు చెరో రెండుసార్లు బ్యాటింగ్(Bating) చేశాయి. అయితే జట్టులో 11 మంది కాదు 12 మంది ఆటగాళ్లు ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిటన్ కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బ్రిటన్ జట్టు తరపున అత్య‌ధికంగా ఫ్రెడరిక్ కమ్మింగ్ 38 పరుగులు చేశాడు. ఫ్రెంచ్ బౌలర్ డబ్ల్యూ అండర్సన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ఆపై ఫ్రెంచ్(French) జట్టు కేవలం 78 పరుగులకే కుప్పకూలింది. జట్టులోని ఇద్దరు బ్యాట్స్‌మెన్ మాత్రమే 10 పరుగులు చేయగలిగారు. బ్రిటన్‌కు చెందిన ఎఫ్‌డబ్ల్యూ క్రిస్టియన్ ఏడు వికెట్లు తీసి అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. దీంతో బ్రిటన్‌కు 39 పరుగుల ఆధిక్యం లభించింది. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడానికి ముందు.. ఫ్రాన్స్‌కు బంగారు పతకం గెలవాలంటే 185 పరుగుల లక్ష్యం ముందుంది. రెండో ఇన్నింగ్స్‌లో బ్రిట‌న్ త‌రుపున‌ బీచ్‌క్రాఫ్ట్ (54), ఆల్‌ఫ్రెడ్ బోవర్‌మన్ (59) పరుగులు చేయగా.. ఎఫ్. రౌక్స్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి ఫ్రాన్స్‌కు అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. ఫ్రాన్స్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 26 పరుగులకే కుప్పకూలగా.. అందులో ఆరుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవకుండా విఫలమయ్యారు. గ్రేట్ బ్రిటన్ తరఫున మాంటగు టోలర్ 7 వికెట్లు పడగొట్టాడు. గ్రేట్ బ్రిటన్ ఫైనల్ మ్యాచ్‌లో 158 పరుగుల తేడాతో గెలిచి క్రికెట్‌లో బంగారు పతకా(Gold Medal)న్ని గెలుచుకుంది.

Updated On 16 Oct 2023 10:32 PM GMT
Yagnik

Yagnik

Next Story