China violates Asia Game Rules : చైనా దుందుడుకు చర్య.. అరుణాచల్‌ప్రదేశ్ క్రీడాకారులకు నో ఎంట్రీ !
డ్రాగన్ దేశం చైనా(China) మరోసారి తన కురచబుద్ధిని చాటుకుంది. ఆసియా గేమ్స్‌లో(Asia Games) పాల్గొనేందుకు వెళ్లిన అరుణాచల్‌ప్రదేశ్(Arunachal Pradesh) ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా నిరాకరించింది. ఇది భారత్‌కు బాగా కోపం తెప్పించింది. ఆ కోపంతోనే కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్(Anurag Tagore) చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆటగాళ్లను రాకుడా ఆపడటం ఆసియా గేమ్స్ నిబంధనలకు వ్యతిరేకమని, అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌లో భాగమని అనురాగ్ ఠాగూర్ స్పష్టం చేశారు.
డ్రాగన్ దేశం చైనా(China) మరోసారి తన కురచబుద్ధిని చాటుకుంది. ఆసియా గేమ్స్‌లో(Asia Games) పాల్గొనేందుకు వెళ్లిన అరుణాచల్‌ప్రదేశ్(Arunachal Pradesh) ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా నిరాకరించింది. ఇది భారత్‌కు బాగా కోపం తెప్పించింది. ఆ కోపంతోనే కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్(Anurag Tagore) చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆటగాళ్లను రాకుడా ఆపడటం ఆసియా గేమ్స్ నిబంధనలకు వ్యతిరేకమని, అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌లో భాగమని అనురాగ్ ఠాగూర్ స్పష్టం చేశారు. చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడలలో పాల్గొనేందుకు భారత్‌కు చెందిన వుషు జట్టు వెళ్లింది. ఇందులో ముగ్గురు అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారు. వీరి ప్రవేశాన్ని మాత్రం చైనా రద్దు చేసింది. వారి వీసాలను, అక్రిడేషన్‌ను రద్దు చేసింది. ఏడుగురు ఆటగాళ్లు, సిబ్బందితో కూడిన మిగిలిన భారతీయ వుషు జట్టు హాంకాంగ్‌కు వెళ్లి అక్కడి నుంచి చైనాలోని హాంగ్‌జౌకు విమానంలో బయలుదేరింది. చైనా తీరుపై భారత విదేశాంగశాఖ మండిపడింది. ప్రాంతీయత ఆధారంగా క్రీడాకారుల ప్రవేశాన్ని రద్దు చేయడాన్ని భారత్ అంగీకరించబోదని స్పష్టం చేసింది. భారత్‌లో భాగమైన అరుణాచల్‌ప్రదేశ్‌లోని క్రీడాకారుల ప్రవేశాన్ని చైనా రద్దు చేయడం ఆసియా గేమ్స్ నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. చైనా ఎంట్రీ దొరకని భారత ఆటగాళ్లను ఢిల్లీకి తీసుకువచ్చింది.ఇదిలా ఉంటే ఆసియా క్రీడలను నిర్వహించే అత్యున్నత కమిటీ దీనిపై స్పందించింది. ఈ విషయాన్ని ఆసియా ఒలింపిక్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపింది. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అన్ని దేశాల ఆటగాళ్లకు అవకాశం ఇచ్చామని చైనా విదేశాంగ శాఖ మంత్రి మావోనింగ్ అంటున్నారు. ప్రస్తుతం చెప్పుకుంటున్న అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ప్రభుత్వం గుర్తించలేదని, ఆ భూభాగం చైనాకు చెందిన జియాంగ్ ప్రాంతంలోనిదేనని ఆయన పేర్కొన్నారు. అది చైనాలో అంతర్భాగమన్నారు.