ఆదివారం నాడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జ‌ట్ల‌ మధ్య జ‌ర‌గాల్సిన‌ ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా జరగలేదు. దీంతో సోమవారం రిజర్వ్ డే రోజున ఛాంపియన్‌ను నిర్ణయించనున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఆదివారం టాస్ కూడా ప‌డ‌లేదు. వర్షం కారణంగా స్టేడియం చెరువులా మారింది.

ఆదివారం నాడు చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జ‌ట్ల‌ మధ్య జ‌ర‌గాల్సిన‌ ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా జరగలేదు. దీంతో సోమవారం రిజర్వ్ డే(Reserve Day) రోజున ఛాంపియన్‌(Champion)ను నిర్ణయించనున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఆదివారం టాస్ కూడా ప‌డ‌లేదు. వర్షం(Rain) కారణంగా స్టేడియం చెరువులా మారింది. ఇరు జట్ల కోచ్‌లు, కెప్టెన్‌ల‌తో మాట్లాడిన తర్వాత మ్యాచ్‌ను నిర్వహించకూడదని అంపైర్లు నిర్ణయించారు. వర్షం రాత్రి 11 గంటలకు ఆగింది. అయితే మైదానం ఆర‌టానికి కనీసం గంట సమయం పడుతుంది. ఆ తర్వాత మ్యాచ్ జరిగితే ఇరు జ‌ట్ల‌కు ఐదు ఓవర్ల ఆట‌ మాత్రమే సాధ్య‌మ‌య్యేది.

దీంతో ఇరు జట్ల కోచ్‌(Coach)లు, కెప్టెన్‌(Captain)ల‌తో మాట్లాడిన అనంతరం అంపైర్లు(Umpire) మ్యాచ్‌ను వాయిదా వేశారు. దీంతో మ్యాచ్‌ సోమవారం జ‌రుగ‌నుంది. రాత్రి తొమ్మిది గంటలకు వర్షం ఆగిపోయి.. దాదాపు ఆట‌కు వీలుగా తయారైంది. కానీ వర్షం మళ్లీ వచ్చింది. ఆ తర్వాత రాత్రి 11 గంటలకు వర్షం ఆగింది. దీంతో ఆట సాధ్య‌ప‌డ‌లేదు. ఐపీఎల్ మేనేజ్‌మెంట్‌ మ్యాచ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ట్విట్టర్‌లో ఇచ్చింది. ఐపీఎల్ ఫైనల్(IPL Final) మే 29 రాత్రి 7:30 గంటలకు వాయిదా(Postpone) పడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi)లో రిజర్వ్ డే రోజున మ్యాచ్ జరగనుంది. నేటి టిక్కెట్లు రేపటికి చెల్లుబాటు అవుతాయి. టిక్కెట్‌(Ticket)ను సురక్షితంగా ఉంచుకోమ‌ని ఫ్యాన్స్‌ను అభ్యర్థించారు.

Updated On 28 May 2023 9:40 PM GMT
Yagnik

Yagnik

Next Story