CSK vs GT : గుజరాత్ ఓటమి.. చెన్నైకి వరుసగా రెండో విజయం
ఐపీఎల్ 2024 ఏడో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగింది.
ఐపీఎల్ 2024 ఏడో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో తలపడింది. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచిన గుజరాత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 206 పరుగులు చేయగా.. అనంతరం గుజరాత్ జట్టు 143 పరుగులు మాత్రమే చేసి ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 63 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
ఈ విజయంతో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై జట్టు నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. CSK తదుపరి మ్యాచ్ మార్చి 31న విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతుంది. గుజరాత్ తదుపరి మ్యాచ్ మార్చి 31న అహ్మదాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతుంది.
మొదట బ్యాటింగ్ చేసిన CSKకి రచిన్ రవీంద్ర, రితురాజ్ గైక్వాడ్ గొప్ప ఆరంభాన్ని అందించారు. రచిన్, గైక్వాడ్ చెరో 46 పరుగులు చేశారు. అలాగే.. శివమ్ దూబే దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో సీఎస్‌కే గుజరాత్‌కు 207 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్ జట్టులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తో సహా అందరూ విఫలమయ్యారు. దీంతో వరుసగా రెండో ఓటమిని కూడగట్టుకుంది గుజరాత్ టైటాన్స్.