చెన్నై సూపర్ కింగ్స్ తమ సొంత మైదానంలో అద్భుత ప్రదర్శన చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 78 పరుగుల భారీ తేడాతో ఓడించింది.

చెన్నై సూపర్ కింగ్స్ తమ సొంత మైదానంలో అద్భుత ప్రదర్శన చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 78 పరుగుల భారీ తేడాతో ఓడించింది. చెన్నై తరఫున కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గత రెండు మ్యాచ్‌ల్లో చెన్నై ఓడిపోయినా.. ఈ విజ‌యంలో మళ్లీ గెలుపు ట్రాక్‌లోకి చేరుకోగలిగింది, అయితే హైదరాబాద్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది.

కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, డారిల్ మిచెల్ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత, తుషార్ దేశ్‌పాండే నేతృత్వంలోని బౌలర్ల బలమైన ప్రదర్శన కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ 78 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. గైక్వాడ్, మిచెల్ ల సెంచరీ భాగస్వామ్యంతో 20 ఓవర్లలో మూడు వికెట్లకు 212 పరుగులు చేసింది. బ‌దులుగా హైదరాబాద్ జట్టు 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. హైద‌రాబాద్ జ‌ట్టులో మార్క్‌రామ్‌(30 ప‌రుగులు) మాత్ర‌మే చెప్పుకోద‌గ్గ స్కోరు చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు.

హైదరాబాద్‌పై భారీ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో మూడు స్థానాలు ఎగబాకి ఐదు విజయాలతో 10 పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి చేరుకోగా, హైదరాబాద్ జట్టు రెండు వరుస ఓటములతో నాలుగో స్థానంలో ఉంది.

Updated On 28 April 2024 10:00 PM GMT
Yagnik

Yagnik

Next Story