RCB vs CSK : నేడు ఆర్సీబీ, సీఎస్‌కే మ్యాచ్.. గత రికార్డులు పరిశీలిస్తే..
ఐపీఎల్ 2023 24వ మ్యాచ్ సోమవారం ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Banglore), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మధ్య జరగనుంది ఆర్‌సీబీకి ఫాఫ్ డు ప్లెసిస్(Faf du Plessis) కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. ఎంఎస్ ధోనీ(MS Dhoni) సీఎస్‌కేకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇరు జట్లలో చాలా మంది బలమైన ఆటగాళ్లు ఉండటంతో ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉంటుందని భావిస్తున్నారు. ఐపీఎల్-2023 పాయింట్ల పట్టికలో ఆర్సీబీ జట్టు ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. […]

Chennai Super Kings vs Royal Challengers Bangalore Head to Head Records
ఐపీఎల్ 2023 24వ మ్యాచ్ సోమవారం ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Banglore), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మధ్య జరగనుంది ఆర్‌సీబీకి ఫాఫ్ డు ప్లెసిస్(Faf du Plessis) కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. ఎంఎస్ ధోనీ(MS Dhoni) సీఎస్‌కేకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇరు జట్లలో చాలా మంది బలమైన ఆటగాళ్లు ఉండటంతో ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉంటుందని భావిస్తున్నారు. ఐపీఎల్-2023 పాయింట్ల పట్టికలో ఆర్సీబీ జట్టు ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని ఆర్సీబీ 4 మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు సాధించింది. ఆర్సీబీ తన చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)పై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని సీఎస్‌కే కూడా నాలుగు మ్యాచ్‌లలో రెండు గెలిచింది. ఈఎస్‌కే తన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) చేతిలో 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈరోజు ఇరు జట్ల మధ్య అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌గా భావిస్తున్నారు. ఇరుజట్లు ఇప్పటివరకూ 30 సార్లు తలపడగా.. 19 సార్లు సీఎస్‌కే, 10 సార్లు ఆర్సీబీ విజయం సాధించాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. గత ఏడాది ఎడిషన్‌లో మ్యాచ్ నంబర్ 49లో ఇరు జట్లు చివరిసారిగా తలపడ్డాయి. పూణె(Puneలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 13 పరుగుల తేడాతో సీఎస్‌కేను ఓడించింది. ఈ మ్యాచ్ రాత్రి 7:30కు ప్రారంభమవుతుంది. టాస్ అరగంట ముందు ఉంటుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్(Star Sports)లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. జియో సినిమా(Jio Cinema) ఓటీటీ యాప్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్(Live Streaming)ను ఆస్వాదించవచ్చు.
