ఐపీఎల్‌-2024 49వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ సొంతగడ్డపై చెన్నైను 7 వికెట్ల తేడాతో ఓడించింది.

ఐపీఎల్‌-2024 49వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ సొంతగడ్డపై చెన్నైను 7 వికెట్ల తేడాతో ఓడించింది. పంజాబ్ ఈ విజయంతో ప్లేఆఫ్ రేసు ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ ఓపెన‌ర్ ప్రభ్‌సిమ్రన్ 13 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ త‌ర్వాత రిలే రూసో, జానీ బెయిర్‌స్టో జాగ్రత్తగా ఆడి మంచి బాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. బెయిర్‌స్టో 46 పరుగులు, రిలే రూసో 43 పరుగులు చేసి ఔట్ అయ్యారు. అనంతరం కెప్టెన్ సామ్ కుర్రాన్ (26 నాటౌట్), శశాంక్ సింగ్ (25 నాటౌట్) రాణించడంతో పంజాబ్ 17.5 ఓవర్లలో 163 ​​పరుగులకే ల‌క్ష్యాన్ని చేదించింది. చెన్నైకి చెందిన ముగ్గురు బౌలర్లకు ఒక్కో వికెట్ దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జ‌ట్టులో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌తో పంజాబ్ కింగ్స్‌కు 163 పరుగుల లక్ష్యాన్ని అందించింది. రుతురాజ్ 48 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. పంజాబ్ బౌల‌ర్లలో హర్‌ప్రీత్‌ బ్రార్‌, రాహుల్‌ చాహర్‌లు రెండేసి వికెట్లు తీశారు.

Updated On 1 May 2024 10:19 PM GMT
Yagnik

Yagnik

Next Story